Short News

క‌రుణానిధి ఆరోగ్యం అత్యంత విష‌మం.. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు

క‌రుణానిధి ఆరోగ్యం అత్యంత విష‌మం.. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు

డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై కావేరీ ఆస్పత్రి ఇవాళ సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆయ‌న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. కాసేపటి క్రితం సీఎం పళనిస్వామితో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ టీకే రాజేంద్రన్ సమావేశమై కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై చర్చించారు. అంతకుముందు పళనిస్వామిని స్టాలిన్ కలిసి కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. సీఎం పళినిస్వామితో డీజీపీ భేటీ ముగిసిన అనంతరం అన్ని జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
గోదావరికి అనూహ్యంగా చేరుతున్న వరద నీరు

గోదావరికి అనూహ్యంగా చేరుతున్న వరద నీరు

శుక్రవారం గోదావరి నదికి భారీగా వరద పోటెత్తే అవకాశముంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో ఏజెన్సీతో పాటు కోనసీమ, ఇతర తీర మండలాల్లో ప్రజలను యంత్రాంగం అప్రమత్తం చేసింది. ధవళేశ్వరం ఆనకట్టకు శుక్రవారం సాయంత్రానికి భారీగా వరదనీరు చేరే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో కోనసీమ లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గత వారం రోజులుగా గోదావరి ఉద్ధృతితో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు యంత్రాంగం ముందస్తు సహాయ చర్యలను వేగవంతం చేసింది.
గోదావరికి పోటెత్తే వరదనీరు...కోనసీమలో భయం!

గోదావరికి పోటెత్తే వరదనీరు...కోనసీమలో భయం!

గోదావరి నదికి ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కారణంగా శుక్రవారం భారీగా ఈ నదికి వరద పోటెత్తే అవకాశముందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.అందువల్ల తమ శాఖను అప్రమప్తం చేయడంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు కోనసీమ, ఇతర తీర మండలాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. ధవళేశ్వరం ఆనకట్టకు శుక్రవారం సాయంత్రానికి భారీగా వరదనీరు చేరే అవకాశం ఉందని అధికారులు తెలపడంతో కోనసీమలో లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

పవన్‌ కాపు నేతే!:బిసి సంఘం

పవన్‌ కాపు నేతే!:బిసి సంఘం

కాపు రిజర్వేషన్ల విషయమై కేంద్రం అడిగిన రెండు ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. విద్య, ఉద్యోగ రంగాలు సహా అన్నింటిలోనూ వెనుకబడి ఉండటం వల్లే కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి వచ్చిందని ఎపి ప్రభుత్వం వివరణ ఇచ్చింది. బీసీ కమిషన్‌ నివేదికలోని గణాంకాల ఆధారంగానే వారి జీవన స్థితిగతులు, దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాల సంఖ్య, వివిధ రంగాల్లో ఆయా వర్గాల వెనుకబాటుతనాన్ని ప్రాతిపదికగా తీసుకున్నాట్లు ఎపి ప్రభుత్వం వివరించింది.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more