Short News

కుమారస్వామికి 'తండ్రి' షాక్: దేవేగౌడకు బీజేపీ దెబ్బకు దెబ్బ

కుమారస్వామికి 'తండ్రి' షాక్: దేవేగౌడకు బీజేపీ దెబ్బకు దెబ్బ

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 104 స్థానాలతో పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని గవర్నర్‌ వాజుభాయ్‌ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. దీంతో ఆ పార్టీ శాసన సభా పక్ష నేత యడ్యూరప్ప కర్ణాటక 23వ సీఎంగా ప్రమాణం చేశారు.బల నిరూపణకు ఆయనకు పదిహేను రోజుల గడువు ఇచ్చారు. మరోవైపు, తనకు సంపూర్ణ మెజార్టీ ఉందని, ఇతర ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతూ గవర్నర్‌కు ఇచ్చిన లేఖను ఇవ్వాలని సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

మాధురి దీక్షిత్ డ్యాన్స్‌.. ఆన్‌లైన్లో వైర‌ల్‌

మాధురి దీక్షిత్ డ్యాన్స్‌.. ఆన్‌లైన్లో వైర‌ల్‌

బాలీవుడ్ అందాల నటి మాధురీ దీక్షిత్ డ్యాన్స్ చేసిందంటే అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఐదు పదుల వయసులోనూ తన డ్యాన్స్ ఫర్‌ఫార్మెన్స్‌తో మరోసారి మెస్మరైజ్ చేసింది మాధురీ. రేణుక సహానే, మాధురీ 1994లో వచ్చిన ‘హమ్ ఆప్కే హై కౌన్' చిత్రంలోని సీన్ ను మరోసారి రిపీట్ చేశారు ఈ ఇద్దరు తారలు. మాధురీ తాజాగా బకెట్ లిస్ట్ అనే మరాఠీ డెబ్యూట్ మూవీ చేస్తుంది. ఈ సినిమా సెట్స్‌లో మాధురీ తన కోస్టార్ రేణుక సహానేతో కలిసి డ్యాన్స్ చేసి అదరహో అనిపించింది. ఈ డ్యాన్స్ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.   
రూ.98కే రోజుకు 1.5 జీబీ డేటా అంటున్న బీఎస్ఎన్ఎల్‌

రూ.98కే రోజుకు 1.5 జీబీ డేటా అంటున్న బీఎస్ఎన్ఎల్‌

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. డేటా సునామీ ఆఫర్ కింద రూ.98కే ఓ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. దీంట్లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌కు వాలిడిటీని 26 రోజులుగా నిర్ణయించారు. అంటే మొత్తం 26 రోజులకు గాను 39 జీబీ డేటా వినియోగదారులకు లభిస్తుంది. ఈ క్రమంలో 1 జీబీ డేటా ఖరీదు కేవలం రూ.2.51 మాత్రమే అవుతుంది. జియో, ఎయిర్‌టెల్‌లతో పోలిస్తే తక్కువ ధరకే బీఎస్‌ఎన్‌ఎల్ రూ.98 ప్లాన్ లభిస్తుండడం విశేషం.   
రెండు నిమిషాల ప‌రుగుతో ఎముక‌లు దృఢం

రెండు నిమిషాల ప‌రుగుతో ఎముక‌లు దృఢం

వయస్సు మీద పడుతున్నకొద్దీ స్త్రీలలో ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుందన్న సంగతి తెలిసిందే! ఎముకలు పూర్వ ఆరోగ్యం సంతరించుకోవడానికి ప్రతి రోజూ రెండు నిమిషాలు పరుగు తీయడం లేదా జిమ్‌లో బరువులెత్తడం చేస్తే మంచి ఫలితం పొందవచ్చంటున్నారు నిపుణులు. సుమారు 2500 మంది స్త్రీల మీద వీరు సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. వీరిలో కొందరి చేత ప్రతి రోజూ రెండు నిమిషాల పాటు పరుగు, జిమ్‌లో బరువులెత్తించడం చేశారు. మిగతావారిని మామూలుగా నడవమన్నారు. కొన్ని రోజుల తరువాత వీరి ఆరోగ్యాన్ని పరిశీలించగా పరుగుతీసిన స్త్రీలలో ఎముకల ఆరోగ్యం మునుపటికన్నా మెరుగు పడటం గుర్తించారు.