Short News

గాలి జనార్దన్ రెడ్డి ఫ్యామిలీకి చెక్, బీజేపీ రిస్క్, సుష్మాస్వరాజ్ ఎంట్రీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో!

గాలి జనార్దన్ రెడ్డి ఫ్యామిలీకి చెక్, బీజేపీ రిస్క్, సుష్మాస్వరాజ్ ఎంట్రీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో!

కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా బళ్లారి జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. బీజేపీ ఎవ్వరూ ఊహించని విధంగా రిస్క్ చేస్తుంది. బళ్లారి జిల్లాలో మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్ కు చెక్ పెట్టాలని బీజేపీ నిర్ణయించిందని ప్రచారం జరుగుతోంది. బళ్లారి నగర శాసన సభ నియోజక వర్గం నుంచి గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్ ను కాకుండా కొత్త వ్యక్తిని రంగంలోకి దించాలని బీజేపీ నిర్ణయించిందని సమాచారం.

ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లో వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. అంతర్జాతీయ బలహీన సంకేతాలతో దేశీయ మార్కెట్లు నేడు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. మదుపర్ల అప్రమత్తతో ఆరంభం నుంచే సూచీలు నష్టాల బాట పట్టాయి. మార్కెట్‌ ప్రారంభంలో సెన్సెక్స్‌ 50 పాయింట్లకు పైగా కోల్పోయింది.  సెన్సెక్స్‌ 28 పాయింట్ల స్వల్ప నష్టంతో 34,589 వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 10,603 వద్ద ట్రేడవుతున్నాయి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, టెక్‌ మహింద్రా, విప్రో తదితర షేర్లు లాభాల్లో ఉన్నాయి.
గుంటూరులో మరో నిర్భయ కేసు : వివాహితపై  మైనర్ అత్యాచారం

గుంటూరులో మరో నిర్భయ కేసు : వివాహితపై మైనర్ అత్యాచారం

మహిళలపై అత్యాచారాలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చట్టాలను తీసుకొచ్చినా కానీ, ఈ తరహ ఘటనలు మాత్రం ఆగడం లేదు. గుంటూరు జిల్లాలో నిర్భయ తరహ ఘటన చోటు చేసుకొంది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఒంటరి మహిళను చూసి బాధితురాలిపై దుండగుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా ఒప్పిచర్లలో ఈ ఘటన చోటు చేసుకొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనాస్థలంలో ఆధారాలను సేకరించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.

డాక్టర్లకు బిపి పెంచుతున్న..."వీరమాచినేని డైట్ ప్లాన్

డాక్టర్లకు బిపి పెంచుతున్న..."వీరమాచినేని డైట్ ప్లాన్

పేషెంట్లకు మేలు సంగతేమో కానీ తెలుగు డాక్టర్లకు బిపి పెంచుతోంది "వీరమాచినేని డైట్ ప్లాన్"...కారణం ఇటీవలి కాలంలో తమ దగ్గరకు వస్తున్న సగం మందికి పైగా ఈ డైట్ గురించే ఆరాలు తీస్తుండటమే...అసలు కొందరైతే రోగం గురించి కాకుండా ఈ కీటో డైట్ గురించి తమ సందేహాలు తీర్చుకునేందుకే ఫీజులు కట్టి ఒపీలు రాయించుకొని మరీ డాక్టర్ల దగ్గరకు వస్తున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏపిలో తెలుగు పేషెంట్ల నోటి నుంచి వచ్చే ఒక ప్రశ్న అల్లోపతి డాక్టర్లకు అస్సలు నచ్చడం లేదు...ఆ కొచ్చెన్ ఏంటంటే..."సార్‌..! వీరమాచినేని డైట్ ప్లాన్ వాడమంటారా?"...