Short News

కర్ణాటక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు కేరళకు షిఫ్ట్: ఆపరేషన

కర్ణాటక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు కేరళకు షిఫ్ట్: ఆపరేషన

బెంగళూరు నగర శివార్లలోని బిడిదిలో ఉన్న ఈగల్టన్ రిసార్టులోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ది గాల్ఫ్ విలేజ్ రిసార్టులో ఉన్న జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కేరళకు తరలించాలని ఇరు పార్టీల నాయకులు నిర్ణయించారు. రిసార్టుల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు బయటకు వెళ్లిపోతున్న సమయంలో ఎక్కడ అమ్ముడుపోతారో అనే భయంతో కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు ఎమ్మెల్యేలను కేరళలోని కొచ్చికి తరలించాలని నిర్ణయించారు. కొచ్చిలోని బవ్రంటన్ బోర్డ్ యార్డ్ అనే 7 స్టార్ హోటల్ ను ఇప్పటికే బుక్ చేశారు.

జడేజా భార్య జుట్టు పట్టి లాగిన కానిస్టేబుల్

జడేజా భార్య జుట్టు పట్టి లాగిన కానిస్టేబుల్

భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రీవా జడేజా కారు ఒక కానిస్టేబుల్‌ బైక్‌ను స్వల్పంగా ఢీకొంది. సరు సెక్షన్‌ రోడ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే ఆ కానిస్టేబుల్‌ రీవాను జుట్టు పట్టిలాగి దుర్భాషలాడాడు. కానిస్టేబుల్‌ జడేజా భార్యపై చేయిచేసుకొని దుర్భాషలాడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారమందిన అక్కడికి చేరుకున్న పోలీసులు రీవాను నివాసానికి పంపి వీరంగం సృష్టించిన కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని జామ్‌నగర్‌ ఎస్పీ ప్రదీప్‌ వెల్లడించారు.  
ఈ వారం రాశి ఫలాలు మే21 నుండి మే27 వరకు.

ఈ వారం రాశి ఫలాలు మే21 నుండి మే27 వరకు.

రాశి ఫలాల ఆధారంగా ఈ వారం మీ జీవితంలో ఎదురయ్యే లాభ నష్టాల గురించి తెలుసుకోండి :

మనలో అధిక భాగం రాశి ఫలాలలో దినఫలాల కన్నా వార ఫలాల మీదనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తుంటారు. క్రమంగా వారంలో ఎదురయ్యే లాభ నష్టాల మీద అంచనాలతో ప్రణాళికలను ఏర్పరచుకుంటూ ఉంటారు.

ఈ వార ఫలాలు మొత్తం వారంలో మీ రాశిచక్రం గురించిన వివరాలను తెలియజేస్తాయి. ఈ రాశి ఫలాలు వారంలో మనం తీసుకునే నిర్ణయాల లాభనష్టాల గురించి వెల్లడిస్తుంది. మరియు ఒక కొత్త వ్యాపారo ప్రారంభించడానికి ఉత్తమ సమయాన్నితెలియజేస్తుంది .

స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాల్లో ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. కీలక సూచీలతోపాటు, బ్యాంక్‌నిఫ్టీ సానుకూలంగా ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ ప్రస్తుతం 17పాయింట్ల లాభంతో నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో ఉన్నాయి. ఇన్వెస్టర్ల అప్రమత్తత నేపథ్యంలో లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఎస్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మ, ఆయిల్‌ ఇండియా, బజాజ్‌ ఆటో, టాటా మోటార్స్‌ లాభపడుతుండగా, ఆర్‌కాం, ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, పీఎన్‌బీ నష్టపోతున్నాయి. కరెన్సీ మార్కెట్‌లో రూపాయి నష్టాలనుంచి స్వల్పంగా కోలుకుంది. డాలరు మారకంలో 68 రూపాయల స్థాయినుంచి పుంజుకుని 67.96 వద్ద ఉంది.