Short News

కాంగ్రెస్-జేడీఎస్ జతకడితే మోడీ-అమిత్ షాలకు చుక్కలే!

కాంగ్రెస్-జేడీఎస్ జతకడితే మోడీ-అమిత్ షాలకు చుక్కలే!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడటంతో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏ పార్టీకి మెజార్టీ రాకపోయినప్పటికీ రాజ్యాంగబద్ధంగా ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీని గవర్నర్ పిలిచి ప్రభుత్వ ఏర్పాటు గురించి అడగాల్సి ఉంటుంది. మరోవైపు, జేడీఎస్ - కాంగ్రెస్ మాత్రం తమకు సంపూర్ణ మెజార్టీ ఉందని, తమనే పిలవాలని చెబుతున్నాయి. కానీ కుమారస్వామిని సీఎంగా చేస్తుండటంతో కాంగ్రెస్‌లోని కొందరు, దానికి తోడు జేడీఎస్‌లోని కొందరి అసంతృప్తిని బీజేపీ క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.

కుమరస్వామికి మోడీ అభినందనలు

కుమరస్వామికి మోడీ అభినందనలు

కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన హెచ్‌డీ కుమారస్వామికి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు కుమారస్వామికి ఫోన్‌ చేసిన ప్రధాని శుభాకాంక్షలు చెప్పారు. కాగా, 'ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తాం. రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేం పనిచేస్తాం. మేమంతా ఒక్కటే అని దేశప్రజలకు సందేశం ఇచ్చేందుకు ఈనాడు అన్ని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఒకే వేదికపైకి వచ్చారు. 2019లో రాజకీయ పరిస్థితుల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయనేందుకు ఇదొక నిదర్శనం' అని కుమారస్వామి పేర్కొన్నారు.

ఎత్తిపోతల పథకం పనుల్లో అపశ్రుతి: ఇద్దరు మృతి

ఎత్తిపోతల పథకం పనుల్లో అపశ్రుతి: ఇద్దరు మృతి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టు తొలిదశ పనుల్లో భాగంగా కొల్లాపూర్‌ కృష్ణా తీరంలోని ఎల్లూరు, రేగుమానిగడ్డలో జరుగుతున్న సొరంగ నిర్మాణ పనుల వద్ద బుధవారం నార్లపూర్‌ భూగర్భ పంప్‌హౌజ్‌లోకి పోయే టన్నెల్‌లో పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ మొత్తం 18 మంది ఉండగా.. అందరికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

టార్గెట్ బీజేపీ: జాతీయ నేతలతో చంద్రబాబు

టార్గెట్ బీజేపీ: జాతీయ నేతలతో చంద్రబాబు

బీజేపీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరుకు చంద్రబాబు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా వివిధ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ఈ బెంగళూరు పర్యటన అవకాశంగా మలచుకోవాలని చంద్రబాబు భావించారు. ఇందులో భాగంగానే ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం బీజేపీయేతర పక్షాలను ఇందుకు అనుకూలంగా మద్దతు కోరారు.