Short News

కర్ణాటకపై అర్ధరాత్రి హైడ్రామా: కాసేపట్లో సుప్రీం కోర్టు తీర్

కర్ణాటకపై అర్ధరాత్రి హైడ్రామా: కాసేపట్లో సుప్రీం కోర్టు తీర్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ రావడంతో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ వాజుభాయ్ వాలా ఆహ్వానించడంతో కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో గురువారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి బుధవారం రాత్రి వరకు కర్ణాటకలో హైడ్రామా కొనసాగింది. గవర్నర్ నిర్ణయంతో కాంగ్రెస్ - జేడీఎస్ సుప్రీంను ఆశ్రయించడంతో సీన్ ఢిల్లీకి కూడా మారింది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

టీ20లీగ్ 2018లో భాగంగా పుణే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 13 మ్యాచ్ లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 8 మ్యాచ్ ల్లో గెలిచి పాయింట్స్ పట్టికలో 2 వ స్థానంలో ఉంది. ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 13 మ్యాచ్ లు ఆడగా.. కేవలం మూడింటిలో గెలిచి పాయింట్స్ పట్టికలో కింద వరుస నుంచి రెండో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్ గెలిస్తే చెన్నై టాప్ ప్లేస్ కు చేరుకోనుంది.
వైరల్ గా రాం చరణ్, ఎన్టీఆర్ ఫొటో

వైరల్ గా రాం చరణ్, ఎన్టీఆర్ ఫొటో

నటుడు రామ్‌చరణ్‌.. తారక్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఫొటో ఒకటి వైరల్ గా మారింది. చరణ్, ఎన్టీఆర్ ను వెనక నుంచి పట్టుకుని సరదాగా ఆటపట్టిస్తున్నట్లు ఉన్న ఫొటోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు సోదరా! ఈ ఏడాది నీకు అద్భుతంగా ఉండాలి' అని చరణ్‌ పోస్ట్ చేశారు.‌ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రాంచరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
న్యూయార్క్‌ పోలీస్‌గా తొలిసారి  సిక్కు మహిళ

న్యూయార్క్‌ పోలీస్‌గా తొలిసారి సిక్కు మహిళ

గురుశోచ్‌ కౌర్‌ అనే సిక్కు మహిళ తొలిసారిగా అరుదైన ఘనత సాధించారు. తలపాగా ధరించిన ఓ సిక్కు మహిళ మొదటిసారిగా న్యూయార్క్‌ పోలీస్‌ విభాగంలో చేరనున్నారు. న్యూయార్క్‌ సిటీ పోలీస్‌ అకాడమీలో గతవారం డిగ్రీ పూర్తి చేసుకున్న ఆమె పోలీసు సహాయక అధికారిణిగా న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరనున్నారు. యూఎస్‌ ప్రజలు సిక్కిజాన్ని అర్థం చేసుకునే విధంగా గురుశోచ్‌ కౌర్‌ మార్పుతేవాలని ‘మినిష్టర్‌ ఆఫ్‌ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌' హరదీప్‌ సింగ్‌ పూరి కోరారు.