Short News

వక్కలతో రుచికరమైన ఊరగాయలు, విద్యార్థి ప్రయోగం !

వక్కలతో రుచికరమైన ఊరగాయలు, విద్యార్థి ప్రయోగం !

మామిడి కాయ, ఆవకాయ, టమోటో, నిమ్మకాయ, కీరకాయ, నల్లికాయ, ఉల్లిపాయ, తెల్లగడ్డ, కాకరకాయతో పాటు వివిద రకాల ఉరగాయలను మనం చూశాం. మాంసాహారంలో చేపలు, చికెన్, మటన్, రోయ్యలతో ఉరగాయలు తయారు చేస్తారు. అయితే కర్ణాటకలోని మంగళూరు ఇంజనీరింగ్ విద్యార్థి నిఖిల్ వక్కలతో రుచికరం అయిన ఊరగాయలు తయారు చేశాడు. పచ్చి వక్కలు ముక్కలు చేసి 15 రోజుల పాటు ఉప్పు నీటిలో వాటిని పెట్టాలి.
ఉప్పు నీటిలో ఉన్న వక్క ముక్కలు బయటకు తీసిన తరువాత కొత్తిమీర, జిలకర, మెంతిపొడి, జిలకర వేసి కలపాలి. తరువాత మామిడికాయ ఉరగాయ ఎలా తయారు చేస్తారో అలాగే వక్కల ఊరగాయ తయారు చేశాడు

'అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని' కాన్సెప్ట్ పోస్ట‌ర్ విడుద‌ల‌

'అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని' కాన్సెప్ట్ పోస్ట‌ర్ విడుద‌ల‌

మాస్ హీరో ర‌వితేజ ప్ర‌స్తుతం శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రం చేస్తున్నారు. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రంతో ఇలియానా టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తుంది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న‌ మూవీ విడుద‌ల కానుంది. ఇందులో ర‌వితేజ మూడు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్ష‌ల‌తో మూవీ కాన్సెప్ట్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇది అభిమానుల‌ని అల‌రిస్తోంది.   
వ‌రుణ్ తేజ్ 'అంత‌రిక్షం' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

వ‌రుణ్ తేజ్ 'అంత‌రిక్షం' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

తన అంతరిక్ష ప్రయాణాన్ని వెండితెరపై చూపించడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు మెగా హీరో వరుణ్‌ తేజ్‌. ఫిదా, తొలిప‍్రేమ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న వరుణ్‌ తేజ్‌ హీరోగా అంతరిక్షం నేపథ్యంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు​. మూవీ టైటిల్‌ను ‘అంతరిక్షం' అని రివీల్‌ చేశారు. వరుణ్‌ తేజ్‌ అంతరిక్షంలో ఉన్న ఓ ఫొటోను ఫస్ట్‌ లుక్‌గా రిలీజ్‌ చేశారు. సోషల్‌ మీడియాలో ఈ పోస్టు వైరల్‌గా మారింది.   
శ్రీకాకుళంలో జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన ఏపీ సీఎం

శ్రీకాకుళంలో జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన ఏపీ సీఎం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర దిన వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జ‌రిగిన వేడుక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర పోలీసు ద‌ళాల‌ గౌరవ వందనాన్ని ఆయ‌న స్వీకరించారు. అనంత‌రం సీఎం మాట్లాడుతూ నాలుగేళ్లలో రెండంకెల అభివృద్ధి సాధించామ‌న్నారు. రైతులకు రూ.24,500 కోట్ల రుణాలు మాఫీ చేశామ‌న్నారు. ఆనంద ఆంధ్రప్రదేశ్‌ దిశగా ప్రభుత్వ అడుగులు వేస్తోందన్నారు.  
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more