Short News

లైవ్-కర్ణాటక: ఇతర రాష్ట్రాలలో సెగ, హైదరాబాద్‌కు ఎమ్మెల్యేలు

లైవ్-కర్ణాటక: ఇతర రాష్ట్రాలలో సెగ, హైదరాబాద్‌కు ఎమ్మెల్యేలు

కర్ణాటకలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కర్ణాటక ప్రభావం గోవా, బీహార్, మణిపూర్ రాష్ట్రాల పైనా పడుతోంది. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. బీజేపీ హార్స్ ట్రేడింగ్ చేస్తోందని కాంగ్రెస్, జేడీఎస్ ఆరోపిస్తున్నాయి. అయితే గతంలో కాంగ్రెస్ కూడా చీల్చి పాలించిందని మరికొందరు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ - దేవేగౌడలు 1996లో గుజరాత్‌లో బీజేపీని చీల్చి గద్దెనెక్కడం మొదలు.. కర్ణాటకలో ఎన్నికల్లో గెలుపొందడం కోసం లింగాయత్‌లకు ప్రత్యేక మతం అంశాన్ని గుర్తు చేస్తున్నారు.

కుమరస్వామికి మోడీ అభినందనలు

కుమరస్వామికి మోడీ అభినందనలు

కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన హెచ్‌డీ కుమారస్వామికి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు కుమారస్వామికి ఫోన్‌ చేసిన ప్రధాని శుభాకాంక్షలు చెప్పారు. కాగా, 'ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తాం. రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేం పనిచేస్తాం. మేమంతా ఒక్కటే అని దేశప్రజలకు సందేశం ఇచ్చేందుకు ఈనాడు అన్ని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఒకే వేదికపైకి వచ్చారు. 2019లో రాజకీయ పరిస్థితుల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయనేందుకు ఇదొక నిదర్శనం' అని కుమారస్వామి పేర్కొన్నారు.

ఎత్తిపోతల పథకం పనుల్లో అపశ్రుతి: ఇద్దరు మృతి

ఎత్తిపోతల పథకం పనుల్లో అపశ్రుతి: ఇద్దరు మృతి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టు తొలిదశ పనుల్లో భాగంగా కొల్లాపూర్‌ కృష్ణా తీరంలోని ఎల్లూరు, రేగుమానిగడ్డలో జరుగుతున్న సొరంగ నిర్మాణ పనుల వద్ద బుధవారం నార్లపూర్‌ భూగర్భ పంప్‌హౌజ్‌లోకి పోయే టన్నెల్‌లో పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ మొత్తం 18 మంది ఉండగా.. అందరికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

టార్గెట్ బీజేపీ: జాతీయ నేతలతో చంద్రబాబు

టార్గెట్ బీజేపీ: జాతీయ నేతలతో చంద్రబాబు

బీజేపీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరుకు చంద్రబాబు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా వివిధ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ఈ బెంగళూరు పర్యటన అవకాశంగా మలచుకోవాలని చంద్రబాబు భావించారు. ఇందులో భాగంగానే ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం బీజేపీయేతర పక్షాలను ఇందుకు అనుకూలంగా మద్దతు కోరారు.