Short News

''కేసును అక్క‌డ విచారిస్తే ప్ర‌భావితం చేస్తారు''

''కేసును అక్క‌డ విచారిస్తే ప్ర‌భావితం చేస్తారు''

కథువా అత్యాచారం కేసు విచారణను జమ్ము కశ్మీర్‌ నుంచి చండీగఢ్‌కు తరలించాలని బాధితురాలి తండ్రి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ జమ్ము కశ్మీర్‌లో చేపడితే కేసును ప్రభావితం చేస్తారని ఆయ‌న ఆరోపించారు. పిటిషన్‌ను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా విచారణకు అంగీకరించారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు దానిపై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని, జమ్ము కశ్మీర్‌ నుంచి కేసును బదిలీ చేయాలని దిల్లీకి చెందిన ఓ న్యాయవాది కూడా పిటిషన్‌ దాఖలు చేశారు.   
ఆ ట్విట్టర్ అకౌంట్ నాది కాదు

ఆ ట్విట్టర్ అకౌంట్ నాది కాదు

యాంకర్ రవీ తన ట్విట్టర్ అకౌంట్ పై క్లారిటీ ఇచ్చాడు. గత రెండ్రోజులుగా  ట్విట్టర్ ఖాతా నుంచి కొన్ని మీడియా చానల్స్‌ను దూషిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అయితే ఆ కామెంట్లతో తనకెలాంటి సంబంధం లేదని యాంకర్ రవి స్పష్టం చేశాడు. అదంతా ఎవరో సృష్టించారని వాపోయాడు. తన పేరిట అసభ్య పోస్టులు పెట్టిన వారిపై కేసు పెడతానంటూ హెచ్చరించాడు. మీడియా మిత్రులెవరూ ఆ ట్వీట్స్ గురించి కన్ఫ్యూజ్ కావొద్దని రవి విజ్ఞప్తి చేశాడు.
జగన్ ఆ దమ్ముందా? పవన్ నిరూపించు:మంత్రి లోకేష్ ఫైర్

జగన్ ఆ దమ్ముందా? పవన్ నిరూపించు:మంత్రి లోకేష్ ఫైర్

శ్రీకాకుళం:ప్రతిపక్ష నేత జగన్, జగనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఐటి శాఖా మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ కు ప్రధాని మోడీని విమర్శించే దమ్ముందా? ...అని ప్రశ్నించారు. ఒక్కటంటే ఒక్కమాట కూడా ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం జగన్ చేయలేడని లోకేష్ ఎద్దేవా చేశారు.మరోవైపు జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పై లోకేష్ ఆచి తూచి స్పందించారు. పవన్‌కల్యాణ్ చేసిన విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.

ఏప్రిల్ 26న హైదరాబాద్ లో పెట్రోలు, డీజిల్ ధరలు

ఏప్రిల్ 26న హైదరాబాద్ లో పెట్రోలు, డీజిల్ ధరలు

పెట్రోల్‌ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. హైదరాబాద్ లో పెట్రోల్‌, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.లీటరు పెట్రోల్‌ ధర 79.04కు చేరగా డీజిల్‌ ధర రూ.71.63 వద్ద ఉంది. బుధవారంతో పోలిస్తే గురువారం ఎలాంటి మార్పులేదు. అయితే ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలన్నీ గతేడాది జూన్‌ నుంచి రోజు వారీగా పెట్రోలు ధరల సవరిస్తూ వస్తున్నాయి. ధరలు పెరిగేది పైసల్లో అయినా.. సామాన్యుడికి మాత్రం పెను భారంగా మారింది.