Short News

కథువా ఘటనపై నేడు విచారణ ప్రారంభం

కథువా ఘటనపై నేడు విచారణ ప్రారంభం

కథువాఘటనపై నేడు కోర్టు విచారణ ప్రారంభంకానుంది. జమ్ముకశ్మీర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఏడుగురు నిందితులపై మోపిన అభియోగాలను కథువా కోర్టు న్యాయమూర్తి విచారించనున్నారు. ఎనిమిదో నిందితుడు అయిన బాలనేరస్తుడిపై విచారణను విడిగా చేపట్టనున్నారు. మరోవైపు బాధితురాలి కుటుంబ తరఫున వాదించనున్న అడ్వొకేట్‌ దీపికా సింగ్‌ రజావత్‌కు పెద్ద ఎత్తున బెదింపులు వస్తుండం తెలిసిందే. ఆదివారం కూడా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తనకు ఫోన్‌ చేశారని, ఈ కేసు వాదిస్తే రేప్‌చేసి చంపేస్తామని బెదిరించారని ఆమె మీడియాతో చెప్పారు.
ఏప్రిల్ 26న హైదరాబాద్ లో పెట్రోలు, డీజిల్ ధరలు

ఏప్రిల్ 26న హైదరాబాద్ లో పెట్రోలు, డీజిల్ ధరలు

పెట్రోల్‌ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. హైదరాబాద్ లో పెట్రోల్‌, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.లీటరు పెట్రోల్‌ ధర 79.04కు చేరగా డీజిల్‌ ధర రూ.71.63 వద్ద ఉంది. బుధవారంతో పోలిస్తే గురువారం ఎలాంటి మార్పులేదు. అయితే ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలన్నీ గతేడాది జూన్‌ నుంచి రోజు వారీగా పెట్రోలు ధరల సవరిస్తూ వస్తున్నాయి. ధరలు పెరిగేది పైసల్లో అయినా.. సామాన్యుడికి మాత్రం పెను భారంగా మారింది.
‘భూమా’తో సంబంధాలు తెగిపోయాయి: ఏవీ సుబ్బారెడ్డి

‘భూమా’తో సంబంధాలు తెగిపోయాయి: ఏవీ సుబ్బారెడ్డి

ఏపీ మంత్రి భూమా అఖిలప్రియపై టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తనపై ఎప్పుడైతే రాళ్లదాడి జరిపారో అప్పుడే భూమా కుటుంబంతో తనకున్న సంబంధాలు తెగిపోయాయని దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆళ్లగడ్డలో సైకిల్‌ ర్యాలీ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. తనపై మంత్రి అఖిలప్రియే రాళ్ల దాడి చేయించారంటూ ఏవీ సుబ్బారెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

గవర్నర్‌పై బాబు యూటర్న్ ఎందుకు?: సోము ఫైర్

గవర్నర్‌పై బాబు యూటర్న్ ఎందుకు?: సోము ఫైర్

గవర్నర్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. నాలుగేళ్లుగా మంచివారిగా ఉన్న గవర్నర్ నర్సింహన్.. ఒక్కసారిగా చంద్రబాబుకు చెడ్డవారిగా ఎందుకు కనిపిస్తున్నారని ప్రశ్నించారు. బుధవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు.. ఏపీ సీఎం తీరుపై నిప్పులు చెరిగారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కోరని విధంగా 'ప్రజలే నన్ను రక్షించాలి'అని చంద్రబాబు కోరడం విచిత్రంగా ఉందన్నారు.