ఉన్నావ్ రేప్: బాలికను ప్రలోభపెట్టిన మహిళ అరెస్ట్
జమ్ము కాశ్మీర్లో చోటు చేసుకున్న కథువా అత్యాచారం కేసులో మంత్రులుగా ఉన్న ఇద్దరిని తొలగించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ సరైన సందేశం ఇచ్చారని చాలామంది భావిస్తున్నారు. అమ్మాయిల పట్ల ఇలాంటి ఘాతుకాలకు పాల్పడేది లేదని తద్వారా సందశం ఇచ్చారని అంటున్నారు.
ఇదిలా ఉండగా, ఉన్నావ్ అత్యాచారం కేసులో ఇప్పటికే సీబీఐ నిందితుడు కుల్దీప్ సింగ్ సెంగార్‌ను అరెస్టు చేసింది. ఆ తర్వాత రెండో వ్యక్తి శశి సింగ్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసును సీబీఐ వేగంగా దర్యాఫ్తు చేస్తోంది. శశిసింగ్‌ను శనివారం అరెస్టు చేశారు.