Short News

''ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ద్వారా కావేరీ సమస్య పరిష్కారం కాదు''

''ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ద్వారా కావేరీ సమస్య పరిష్కారం కాదు''

ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ద్వారా కావేరీ సమస్య పరిష్కారం కాదని త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యాఖ్యానించారు. చట్టపరంగా వెళితేనే సమస్య నుంచి బయటపడతామ‌ని పేర్కొన్నారు. ఆదివారం చెన్నై విమానాశ్ర‌యంలో ఆయ‌న విలేక‌ర్ల‌తో మాట్లాడారు. కావేరీ ఘటనపై సుప్రీం కోర్టు స్పందిస్తూ మే 3 కల్లా కేంద్రం ముసాయిదాను రూపొందించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రధానికి మెమో అందజేశానని ప‌ళ‌ని తెలిపారు. మాజీ సీఎం జయలలిత ఆరోగ్యంపై మాజీ చీఫ్ సెక్రటరీ పి. రామ్మోహన్‌ రావు తప్పుడు సమాచారం అందించారని ప‌ళ‌ని వెల్ల‌డించారు.   
కళ్యాణ్ రామ్ సరసన ఆ ఇద్దరు హీరోయిన్స్. దర్శకుడు అతడే!

కళ్యాణ్ రామ్ సరసన ఆ ఇద్దరు హీరోయిన్స్. దర్శకుడు అతడే!

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఎంఎల్ఎ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో త్వరలో నా నువ్వు సినిమాను విడుదల చెయ్యబోతున్నాడు. జయేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గ నటిస్తోంది. తాజాగా కళ్యాణ్ రామ్ ఆర్య, అతడు, జల్సా, దూకుడు వంటి హిట్ చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసిన గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయనున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంభందించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

శ్రీరెడ్డి చేసింది తప్పు ..సభ్యత్వం ఇవ్వరు

శ్రీరెడ్డి చేసింది తప్పు ..సభ్యత్వం ఇవ్వరు

తెలుగు సినిమా పరిశ్రమను కుదిపేస్తున్న శ్రీరెడ్డి అంశంపై రాజమండ్రి ఎంపీ, సీనియర్‌ నటుడు మురళీమోహన్ స్పందించారు. 'భారతీయ మహిళ అయివుండి అర్థనగ్న ప్రదర్శన చేయటం తప్పు. క్రమశిక్షణతో లేనివారికి మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌లో సభ్యత్వం ఇవ్వరు. నేను మా అధ్యక్షునిగా ఉంటే శ్రీరెడ్డికి ఖచ్చితంగా సభ్యత్వం ఇవ్వను' అన్నారు. తెలుగు సినీరంగంలో కాస్టింగ్‌ కౌచ్‌ ఉందటూ, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం లేదంటూ ఉద్యమం ప్రారంభించిన శ్రీరెడ్డి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. 
భారీ గోల్డ్ చైన్ అని...కుక్కగొలుసు చేతిలో పెట్టారు

భారీ గోల్డ్ చైన్ అని...కుక్కగొలుసు చేతిలో పెట్టారు

పశ్చిమగోదావరి:ఆకివీడు బంగారం పేరుతో మోసాలకు దిగే నేరగాళ్ల ఆవాసం...మెత్తటి తీయటి మాటలతో మెల్లిగా రంగంలోకి మొత్తంగా దోచుకుపోవడం అక్కడి మాయగాళ్లకి వెన్నతో పెట్టిన విద్య. ఆకివీడుకు చెందిన మేకల నాగేంద్ర, తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన బండి ఈశ్వరరావు తమ వద్ద భారీ మొత్తంలో బంగారం ఉందని, దాన్నితాకట్టు పెట్టి నగదు తీసుకుంటామని తాడేపల్లిగూడెంలోని కొసమట్టం ఫైనాన్స్‌ కంపెనీని సంప్రదించారు. తమ వద్ద ఉన్నది బాగా బరువుండే అరుదైన బంగారు ఆభరణం అని చెప్పారు.