Short News

బెంగళూరు నుంచి కేరళకు!: ఎమ్మెల్యేలను తరలిస్తున్న కాంగ్రెస్

బెంగళూరు నుంచి కేరళకు!: ఎమ్మెల్యేలను తరలిస్తున్న కాంగ్రెస్

తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేరళకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కొచ్చి లోని క్రౌన్ ప్లాజాలో ఎమ్మెల్యేల కోసం 125 గదులు బుక్ చేసినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎర్నాకులం పట్టణానికి 5కి.మీ దూరంలో కుందన్నూర్ వద్ద ఈ ఐదు నక్షత్రాల హోటల్ ఉంది. కొచ్చి వర్గాల సమాచారం మేరకు.. ఎమ్మెల్యేలకు అవసరమైన ఏర్పాట్లన్ని అక్కడ జరుగుతున్నట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో సోనియా గాంధీ సైతం కేరళ ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితలతో మాట్లాడినట్టు తెలుస్తోంది. రిసార్టులో ఏర్పాట్ల గురించి వీరి మధ్య సంభాషణ జరిగినట్టు చెబుతున్నారు.

తొలిసారి చిన్నారిపై పాట రూపొందించిన వ‌ర్మ‌

తొలిసారి చిన్నారిపై పాట రూపొందించిన వ‌ర్మ‌

విలక్షణ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ, నాగార్జున అక్కినేని కాంబినేష‌న్లో తెర కెక్కిన చిత్రం ఆఫీసర్‌. ఈ చిత్రం నుంచి తొలి పాటను కాసేపటి క్రితం దర్శకుడు వర్మ ట్విటర్‌లో రిలీజ్‌ చేశారు. తన కెరీర్‌లోనే తొలిసారిగా ఓ చిన్న పాపపై తాను పాటను రూపొందించానని వ‌ర్మ చెప్పారు. ‘నవ్వే నువ్వు నవ్వకపోతే..' అంటూ సాగే సాంగ్‌కు రమ్య బెహరా గాత్రం అందించారు. తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్‌ ఆధారంగా సాగే ఈ పాటను సిరాశ్రీ రచించారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన వర్మకు సిరాశ్రీ థాంక్స్‌ చెప్పగా, తనదైన స్టైల్‌లో వర్మ రిప్లై కూడా ఇచ్చాడు.   
బంగారి బాలరాజు పాటలు విడుదల చేసిన  నిర్మాత దిల్ రాజు, మంత్రి భూమా అఖిలప్రియ

బంగారి బాలరాజు పాటలు విడుదల చేసిన నిర్మాత దిల్ రాజు, మంత్రి భూమా అఖిలప్రియ

బంగారి బాలరాజు చిత్రం ఆడియోలోని మొదటి మూడు పాటలను నందమూరి కళ్యాణ్ రామ్, నిర్మాతలు అశ్వనీదత్, అనిల్ సుంకర విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం లోని మరోపాట 'నా కొంగులో నా గుండెలో....' అంటూ సాగే సాంగ్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారి చేతుల మీదుగా విడుదల చేశారు. కొత్తవారితో తెరకెక్కిన బంగారి బాలరాజు సినిమా మంచి విజయం సాధించి అందరికి మంచిపేరు తీసుకురావాలని మూవీ యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి నాయకులు బిజ్జం పార్ధసారధి రెడ్డి గారు మాట్లాడుతూ... బంగారి బాలరాజు సినిమా మంచి విజయం సాధించాలని హీరో, దర్శక నిర్మాతలకు విషెస్ అందించారు.

అత్యంత ధనిక పార్టీల్లో ఫస్ట్ సమాజ్ వాదీ, సెకండ్ టీడీపీ

అత్యంత ధనిక పార్టీల్లో ఫస్ట్ సమాజ్ వాదీ, సెకండ్ టీడీపీ

దేశంలోని అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ)నిలిచింది. 32 ప్రాంతీయ పార్టీల్లో రూ 82.72 కోట్ల ఆదాయంతో సమాజ్‌వాదీ అత్యంత సంపన్న పార్టీగా నిలిచిందని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ నివేదిక వెల్లడించింది. ఎస్‌పీ తర్వాత రూ 72.92 కోట్లతో టీడీపీ రెండో అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఇక ఏఐఏడీఎంకే రూ 48.88 కోట్లతో తర్వాతి స్ధానంలో ఉంది. మొత్తం 32 ప్రాంతీయ పార్టీల ఆదాయం 2016-17లో రూ 321.03 కోట్లుగా నమోదైంది.