Short News

యూపీ సీఎంపై కాంగ్రెస్ నాయ‌కుడి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

యూపీ సీఎంపై కాంగ్రెస్ నాయ‌కుడి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

ఉన్నావ్ అత్యాచార ఘటనపై స్పందిస్తూ కేపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు దినేశ్‌రావు యూపీ సీఎం యోగిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఉన్నావ్‌, కథువా అత్యాచార ఘటనలకు నిరసనగా ఓ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఇందులో పాల్గొన్న దినేశ్‌రావు యోగి సీఎంగా పనికిరారని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన్ను చెప్పులతో కొట్టాలని వ్యాఖ్యానించారు. దీనిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో త‌న వ్యాఖ్య‌లు ఆమోద యోగ్యం కాకపోతే వెనక్కుతీసుకుంటున్నానని దినేశ్ రావు వెల్ల‌డించారు.     
రెవెన్యూ ఉద్యోగులకు శుభవార్త

రెవెన్యూ ఉద్యోగులకు శుభవార్త

రాష్ట్ర రెవెన్యూ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త వినిపించింది. భూరికార్డుల ప్రక్షాళన ప్రక్రియ పూర్తి చేసినందుకు గానూ సీఎం కేసీఆర్.. ఒక నెల మూలవేతనాన్ని రెవెన్యూ సిబ్బంది ప్రోత్సాహకంగా అందుకోనుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రోత్సాహకాలు ప్రకటించడంపై రెవెన్యూ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రెవెన్యూ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
రూ.లక్ష కోట్లతో ఫ్లిప్‌కార్ట్‌, వాల్‌మార్ట్‌ డీల్‌ ..వచ్చేవారమే.!

రూ.లక్ష కోట్లతో ఫ్లిప్‌కార్ట్‌, వాల్‌మార్ట్‌ డీల్‌ ..వచ్చేవారమే.!

గత కొంతకాలంగా ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాను వాల్‌మార్ట్‌ సొంతం చేసుకోనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డీల్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో రెండు సంస్థల మధ్య ఒప్పందం జరగొచ్చని సమాచారం. ఈ ఒప్పందం విలువ 18 బిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1.19లక్షల కోట్లు. ఫ్లిప్‌కార్ట్‌లో 51శాతం, అంతకంటే ఎక్కువ వాటాను కొనుగోలు చేసేందుకు వాల్‌మార్ట్‌ చర్చలు జరుపుతోంది. డీల్‌ దాదాపు పూర్తయ్యిందని, మే మొదటి వారంలో దీనిపై స్పష్టత వస్తుందని కూడా అంటున్నారు.
అబూసలేం పెరోల్ దరఖాస్తు తిరస్కరణ

అబూసలేం పెరోల్ దరఖాస్తు తిరస్కరణ

బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన గ్యాంగ్ స్టర్ అబూసలేం రెండో పెళ్లి కోసం పెట్టుకున్న పెరోల్ దరఖాస్తును నవీ ముంబై పోలీసు కమిషనర్ తిరస్కరించారు. 1993లో ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో 257 మంది మరణించగా, 713 మంది గాయపడ్డారు. ఈ కేసులో కీలక దోషి అయిన అతనికి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ నేపథ్యంలో జైలులో ఉన్న అబూ సలేం తాజాగా తాను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, తనకు 45రోజుల పాటు పెరోల్ ఇవ్వాలని అభ్యర్థించాడు. అయితే పెరోల్ దరఖాస్తును పోలీసులు తిరస్కరించారు.