Short News

రైలు ప్ర‌యాణాల ఇబ్బందుల‌పై  ఫిర్యాదుకు త్వ‌ర‌లో ''మ‌ద‌ద్'' యాప్‌

రైలు ప్ర‌యాణాల ఇబ్బందుల‌పై ఫిర్యాదుకు త్వ‌ర‌లో ''మ‌ద‌ద్'' యాప్‌

రైలు ప్రయాణ సమయంలో తలెత్తే ఇబ్బందులపై ఫిర్యాదు చేసేందుకు భారతీయ రైల్వే త్వరలో మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకు రానుంది. రైళ్లలో అందించే ఆహారం నాణ్యత మొదలు.. వేర్వేరు అంశాలపై ఫిర్యాదు చేయడంతో పాటు అత్యవసర సేవల కోసం అభ్యర్థించేందుకు వీలు కల్పిస్తూ ‘మదద్‌' పేరిట ఈ నెలలోనే యాప్‌ విడుదల చేయనుంది. ప్రయాణికుడి పీఎన్‌ఆర్‌ పేర్కొని యాప్‌ ద్వారా చేసిన ఫిర్యాదు నేరుగా సంబంధిత అధికారికి చేరుతుందని, సమస్య వేగవంతంగా పరిష్కారమవుతుందని రైల్వే శాఖ‌ తెలిపింది.   
మరో ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టుల మృతి

మరో ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టుల మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన తాజా ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సల్స్‌ మరణించారు. అదే జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 16 మంది నక్సల్స్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. గడ్చిరోలి జిల్లా రాజారాం ఖాండ్లా అడవిలోని జిమాల్‌గట్ట ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని ఐజీ శరద్‌ షెలార్‌ తెలిపారు. అయితే ఎంతమంది మరణించారన్న దానిపై కచ్చితమైన లెక్క లేకపోయినా కనీసం ఆరుగురు మరణించారని చెప్పారు.

నాతో 15 నిమిషాల చర్చకు సిద్ధమా: మోడీకి రాహుల్ సవాల్

నాతో 15 నిమిషాల చర్చకు సిద్ధమా: మోడీకి రాహుల్ సవాల్

'సేవ్‌ ది కాన్‌స్టిట్యూషన్‌(రాజ్యాంగ పరిరక్షణ)' ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ సవాలు విసిరారు రాహుల్. రాహుల్‌ గాంధీ సోమవారం 'సేవ్‌ ది కన్‌స్టిట్యూషన్‌' కార్యక్రమాన్ని ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ' ప్రధాని మోడీ నన్ను పార్లమెంటులో ఎదుర్కోలేరు. నాతో కనీసం 15 నిమిషాల పాటు చర్చకు కూడా ధైర్యం చేయలేరు. ఇప్పుడు ఆయన దృష్టంతా మళ్లీ ప్రధాని కావడం మీదే ఉంది. మోడీజీ నాతో చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారా?' అంటూ రాహుల్ గాంధీ సవాల్‌ విసిరారు.

లోకేష్‌పై చంద్రబాబు ప్రశంసలు

లోకేష్‌పై చంద్రబాబు ప్రశంసలు

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి నారా లోకేష్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. మంత్రి లోకేష్‌కు టెక్నాలజీపై మంచి పట్టుందని చెప్పారు. మ‌న ఐటీ మంత్రి ప్రొఫెషనల్‌ అని, ఐటీలో లోకేష్‌కు మంచి పట్టుందని చెప్పారు. తాను మేనేజర్, లీడర్‌ను మాత్రమేనని.. సూచనలు ఇస్తుంటానని చెప్పారు. సాంకేతికత చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రస్తుతం ఐటీ వేదికగా నాలుగో పారిశ్రామిక విప్లవం నడుస్తోందని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.