Short News

''రిజ‌ర్వేష‌న్ల వ‌ల్ల తీవ్ర‌మైన అన్యాయం జరుగుతోంది''

''రిజ‌ర్వేష‌న్ల వ‌ల్ల తీవ్ర‌మైన అన్యాయం జరుగుతోంది''

రిజ‌ర్వేష‌న్ల వ‌ల్ల ఉద్యోగాల ఎంపికలో, కాలేజీ ప్రవేశాల్లో తీవ్రమైన అన్యాయం జరుగుతోందని మధ్యప్రదేశ్ రాష్ట్ర‌ మంత్రి గోపాల్ భార్గవ ఆదివారం ఒక స‌భ‌లో వ్యాఖ్యానించారు. ‘‘అర్హులైన అభ్యర్థులకు కాకుండా రిజర్వేషన్ల పేరిట తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం వల్ల దీర్ఘకాలికంగా దేశ ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం పడుతుంది'' అని ఆయన అన్నారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో మంత్రి వెనక్కి తగ్గారు. రిజర్వేషన్లపై తానెక్క‌డా మాట్లాడ‌లేద‌ని.. వాటిని తాను అమితంగా గౌరవిస్తానని వివరణ ఇచ్చారు.    
తక్కువ ధరలో డ్యుయల్ సిమ్ ఫీచర్ తో ఐఫోన్.!

తక్కువ ధరలో డ్యుయల్ సిమ్ ఫీచర్ తో ఐఫోన్.!

ఐఫోన్ ప్రియులకు శుభవార్త. ఐఫోన్‌ డ్యుయల్ సిమ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. ఈ ఏడాది యాపిల్ మూడు కొత్త ఐఫోన్ మోడల్స్‌ను విడదల చేస్తుందని సమాచారం. వాటిల్లో ఒక మోడల్‌లో డ్యుయల్ సిమ్ ఫీచర్‌ను అందించనుంది. 6.1 ఇంచుల డిస్‌ప్లే సైజ్ ఉన్న ఐఫోన్ మోడల్‌లో ఎల్‌సీడీ డిస్‌ప్లే ఏర్పాటు చేయడంతోపాటు ఇందులో సింగిల్, డ్యుయల్ సిమ్ వేరియెంట్లను యాపిల్ విడుదల చేయనుంది,ఈ ఫోన్‌ను తక్కువ ధరకే అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.
టెన్సన్ రేకెత్తిస్తున్న వన్‌ప్లస్ 6 టీజర్, ప్రతి ఫీచర్ ఓ హైలెట్..

టెన్సన్ రేకెత్తిస్తున్న వన్‌ప్లస్ 6 టీజర్, ప్రతి ఫీచర్ ఓ హైలెట్..

చైనా దిగ్గజం వన్‌ప్లస్ కంపెనీ నుంచి రాబోతున్న వన్‌ప్లస్ 6 మీద అభిమానుల్లో అనేక అంచనాలు నెలకొని ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం కంపెనీ నుంచి వచ్చిన ఈ ఫోన్ టీజర్ నే. ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. స్పీడ్ అలాగే పెర్ఫారెమెన్స్ లో ఈ ఫోన్ అద్భుతంగా ఉండే అవకాశం ఉందని టీజర్ ని బట్టి తెలుస్తోంది. కాగా ఈఫోన్ అతి త్వరలో వినియోగదారుల ముందుకు రానుంది. ఇప్పటి మార్కెట్లో ట్రెండ్ సెట్ చేసేదానికి రెడీ అన్నట్లుగా ఈ ఫోన్ ఫీచర్లు, డిజైన్ టీజర్లో అదరగొడుతున్నాయి.

గేల్ స్పీడ్ కు బ్రేకులు వేస్తాం

గేల్ స్పీడ్ కు బ్రేకులు వేస్తాం

గేల్ స్పీడ్ కు బ్రేక్ లు వేస్తామన్నారు కోల్‌కతా బౌలింగ్ కోచ్ హీత్ స్ట్రీక్. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ఓపెనర్ క్రిస్‌గేల్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టామని కోల్‌కతా బౌలింగ్ కోచ్ హీత్ స్ట్రీక్ తెలిపారు. గేల్ లాంటి ఆటగాళ్లు క్రీజులో నిలదొక్కుకుని లయ, ఆత్మవిశ్వాసాన్ని అందిపుచ్చుకుంటే.. అతను మరింత ప్రమాదకారిగా మారుతాడని అన్నారు తన పరిధిలోకి బంతి వచ్చిందంటే తన సామర్థ్యాన్ని కూడగట్టుకొని సునాయాసంగా బౌండరీలు బాదగలడని అన్నారు.