Short News

క‌రెంటు వ‌చ్చింది.. పండ‌గ చేసుకున్నారు

క‌రెంటు వ‌చ్చింది.. పండ‌గ చేసుకున్నారు

దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 70 ఏళ్లు గడుస్తున్నా నేటికీ మన దేశంలో విద్యుత్‌ వెలుగులకు నోచుకోని గ్రామాలెన్నో ఉన్నాయి. అయితే ప్రతి గ్రామానికి విద్యుత్‌ అందించే లక్ష్యంతో ‘ప్రధాన మంత్రి సహజ్ బిజ్లి హర్ ఘర్ యోజన' పథకాన్ని ఇటీవ‌ల కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా తాజాగా మహారాష్ట్రలోని అమ్రావతి సమీపంలో ఉన్న బులుమ్ గవ్‌హన్ అనే గిరిజన గ్రామంలో విద్యుత్‌ సదుపాయాన్ని కల్పించారు. దీంతో ఆ గిరిజన గ్రామం అంతా పండుగ వాతావరణం నెలకొంది.   
'రేస్ 3' కోసం కాశ్మీర్ వెళుతున్న సల్మాన్

'రేస్ 3' కోసం కాశ్మీర్ వెళుతున్న సల్మాన్

బాలీవుడ్ కండల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ ప్ర‌స్తుతం రెమో డిసౌజా ద‌ర్శ‌క‌త్వంలో 'రేస్ 3' చిత్రాన్ని చేస్తున్నాడు. జూన్ 15న విడుద‌ల కానున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ పూర్తయింది. బ్యాలెన్స్ ఉన్న ఒక్క సాంగ్‌ని చిత్రీక‌రించేందుకు స‌ల్మాన్ అండ్ టీమ్ త్వ‌ర‌లో క‌శ్మీర్‌కి వెళ్ళ‌నుంది. లీ, ల‌డ‌ఖ్ ప్రాంతాల‌లో మూడు రోజుల పాటు చిత్ర బృందం అంతా క‌శ్మీర్‌లోనే ఉంటుంది. భ‌జ‌రంగీ భాయిజాన్ తర్వాత సల్మాన్ క‌శ్మీర్‌లో చిత్రీక‌ర‌ణ చేస్తున్న సినిమా ఇదే. ఈ  చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నాయిక‌.
ఒట్టు తీసి గట్టు మీద పెట్టేస్తున్నా

ఒట్టు తీసి గట్టు మీద పెట్టేస్తున్నా

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక తానే ఉన్నానంటూ వర్మ ప్రకటించడంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీపై నెగటివ్ కామెంట్స్ చేయనని ఒట్టేసిన వర్మ ఒట్టు తీసి గట్టు మీద పెట్టాడు. 'నేను చేసిన పనికి సారీ చెప్పి పీకే మీద ఇక కామెంట్‌ చేయనని మా మదర్‌ మీద ఒట్టు వేసా. ఆ తర్వాత నేను, సీబీఎన్‌, లోకేష్‌, శ్రీనిరాజు, ఆర్కే, రవిప్రకాష్‌, మూర్తి కూటమిలో ఉన్నానని ఆరోపించడంతో మా మదర్‌ అంగీకారంతో ఇప్పుడు నా ఒట్టు తీసి గట్టుమీద పెట్టాను'' అని ట్వీట్‌ చేసాడు.  
బాబోయ్ ..ఎండలు ..మరో రెండు రోజులు ఇంతే.!

బాబోయ్ ..ఎండలు ..మరో రెండు రోజులు ఇంతే.!

తెలంగాణా రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. శుక్రవారం అన్ని జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శని, ఆదివారాలు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గుజరాత్‌ నుంచి వీస్తున్న వేడిగాలుల ప్రభావం తెలంగాణపై పడుతున్నదని పేర్కొంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల పెరగవచ్చని తెలిపింది. శుక్రవారం అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు వెల్లడించింది.