Short News

భార్యపై భర్త విచక్షణారహిత దాడి

భార్యపై భర్త విచక్షణారహిత దాడి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. షాజహాన్ పూర్ కి చెందిన ఓ వ్యక్తి కొంతకాలంగా అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలు పెడుతున్నాడు. ఇదే క్రమంలో రెండు రోజుల క్రితం.. పుట్టింటికి వెళ్లి రూ.50వేలు తీసుకురావాలని ఆమెను బెదిరించాడు. అందుకు ఆమె తిరస్కరించడంతో.. బెల్టుతో విచక్షణారహితంగా చావబాదాడు.బెల్టు దెబ్బలకు తాళలేక ఆమె స్పృహ కోల్పోయింది. అయినా అతని ఆగ్రహం చల్లారలేదు. ఆపై ఆమె రెండు చేతులను చున్నీతో గదిలోని సీలింగ్ ఫ్యాన్ కి కట్టేశాడు. స్పృహలోకి వచ్చాక.. తాను ఏ పరిస్థితులో ఉన్నానో తెలుసుకుని ఆమె బోరున విలపించింది.

క‌ర్ణాట‌క‌లో మ్యానిఫెస్టోల ప్ర‌క‌ట‌న‌కు సిద్ధ‌మ‌వుతున్న పార్టీలు

క‌ర్ణాట‌క‌లో మ్యానిఫెస్టోల ప్ర‌క‌ట‌న‌కు సిద్ధ‌మ‌వుతున్న పార్టీలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. మేనిఫెస్టోలు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఓటర్ల నాడి తెలుసుకునేందుకు అనుభవజ్ఞులైన నాయకులను రంగంలోకి దింపడం ద్వారా విజయానికి బాటలు వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రమంతటికీ ఒకటి, నియోజక వర్గానికి ఒకటి చొప్పున మేనిఫెస్టోలు రూపొందించనున్నట్లు బీజేపీ అధికార ప్రతినిధి వామన్‌ ఆచార్య తెలిపారు. మంగళూరులో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుబ్రహ్మణ్య నేతృత్వంలో జేడీఎస్ మ్యానిఫెస్టో రూపొందించ‌నుంది.     
ఫేస్‌బుక్‌, అనలిటికాకు మరోమారు నోటీసులు

ఫేస్‌బుక్‌, అనలిటికాకు మరోమారు నోటీసులు

ఫేస్‌బుక్‌ వినియోగదారుల వ్యక్తిగత వివరాల దుర్వినియోగంపై కేంబ్రిడ్జి అనలిటికా, ఫేస్‌బుక్‌ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మరోమారు నోటీసులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులకు కేంబ్రిడ్జ్‌ అనలిటికా అస్పష్ట సమాధానం ఇచ్చిన నేపథ్యంలో కేంద్రం రెండు సంస్థలపై మరోసారి ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడం వంటి పనులకు భారతీయుల వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం కాకుండా నివారించేందుకు ఎలాంటి భద్రతా చర్యలు చేపడుతున్నారో చెప్పాలని ఫేస్‌బుక్‌ను కోరింది. సమాచారం దుర్వినియోగం చేసేవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వివరించాలని సూచించింది.
నేను ఉండగా.. ఎలా?: బాబు ముందు అఖిలప్రియ ప్రశ్నలు!

నేను ఉండగా.. ఎలా?: బాబు ముందు అఖిలప్రియ ప్రశ్నలు!

కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య నెలకొన్ని విభేదాల పరిష్కారంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం చంద్రబాబుతో భేటీకి రానీ అఖిల.. గురువారం అమరావతికి బయలుదేరారు.బుధవారం అఖిలప్రియ రాకపోవడంతో ఈ సమావేశం వాయిదాపడింది. చంద్రబాబుతో భేటీకి బుధవారమే ఏవీ సుబ్బారెడ్డి ఉండవల్లికి చేరుకున్నారు. కానీ అఖిల గురువారం వస్తానని చెప్పారు.