Short News

''అక్క‌డ'' కూడా వెకిలి చేష్ట‌లు చేశాడు

''అక్క‌డ'' కూడా వెకిలి చేష్ట‌లు చేశాడు

దేశంలో బాలికలపై జరుగుతున్న అకృత్యాలకు నిర‌స‌న‌గా జ‌రుగుతున్న కార్య‌క్ర‌మంలోనే ఓ ప్ర‌బుద్ధుడు వెకిలి చేష్ట‌ల‌కు పాల్ప‌డ్డాడు. బాలిక‌ల‌పై జ‌రుగుతున్న అత్యాచారాల‌కు నిర‌స‌న‌గా ఇటీవ‌ల ముంబ‌యిలోని కార్టర్ రోడ్డు ప్రాంతంలో ర్యాలీ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఓ మ‌హిళ‌ను ఓ రోమియో వేధించాడు. అభ్యంతరకరంగా మాట్లాడుతూ సైగలు చేశాడు. అక్కడి నుంచి వెళ్లబోతున్న ఆమెను వెంబడించి మరీ వికృత చేష్టలకు దిగాడు. బాధితురాలు వెంట‌నే ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతగాడిని కటకటాల వెనక్కి నెట్టారు.   
యడ్యూరప్పకు బీజేపీ ఊహించని షాక్

యడ్యూరప్పకు బీజేపీ ఊహించని షాక్

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆశాలపై బీజేపీ నీళ్ల చల్లింది. కుమారుడు విజయేంద్రతోపాటు, సన్నిహితురాలు శోభా కరాంద్లజే (యశ్వంత్‌పూర్‌ కోసం) లకు సోమవారం విడుదల చేసిన నాలుగో జాబితాలోనూ చోటు దక్కలేదు. ఆయన కుమారుడికి సీటివ్వడం లేదని పార్టీ అధిష్ఠానం తేల్చిచెప్పింది. అటు, రెండ్రోజుల క్రితం బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్‌ అధికారి రేవణ్ణ సిద్దయ్య (లింగాయత్‌ వర్గం బలమైన నాయకుడు)కు వరుణ నుంచి బీ-ఫామ్‌ ఇచ్చే అవకాశముంది.
వారిద్దరికి వాట్సప్ పెళ్లి చేసింది

వారిద్దరికి వాట్సప్ పెళ్లి చేసింది

యువతి,యువకుడికి వాట్సప్ పెళ్లి చేసింది.అవును నిజం. అయితే వీరిద్దరికి మాటలురావు, చెవులు వినిపించవు. వారిద్దరి పరిచయం వాట్సప్‌ ద్వారా జరిగింది.ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వివాహ భాగ్యంతో ఒక్కటయ్యారు.  ప్రైవేటు కంపెనీలో ఇద్దరి జాబ్ చేస్తుండగా వాట్సప్‌ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆదివారం బళ్లారి జిల్లా కొట్టూరు పట్టణంలోని బనశంకరి కళ్యాణ సముదాయంలో కుటుంబసభ్యులు, బంధుమిత్రలు,స్నేహితుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకన్నారు.
బిగ్‌బాస్‌ షోలో స‌ల్మాన్‌కి కోహోస్ట్‌గా క‌త్రినా కైఫ్‌

బిగ్‌బాస్‌ షోలో స‌ల్మాన్‌కి కోహోస్ట్‌గా క‌త్రినా కైఫ్‌

హిందీ బిగ్‌బాస్‌కు స‌ల్మాన్‌కి కోహోస్ట్‌గా క‌త్రినా కైఫ్‌ని తీసుకోవాల‌ని నిర్వాహకులు భావిస్తున్నార‌ట‌. మాజీ ప్రేమికులైన వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగుంటుంది కాబ‌ట్టి, ఇద్దరు క‌లిసి షో చేస్తే మ‌రింత ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంద‌ని ఆలోచిస్తున్నారట. బిగ్‌బాస్‌ సీజ‌న్‌12 కి కూడా స‌ల్మాన్‌ని హోస్ట్‌గా ఎంపికైతే తొమ్మిదోసారి సల్మాన్ ఈ షోని హోస్ట్ చేస్తున్నట్టు అవుతుంది. సల్మాన్ తొలిసారి 2010లో బిగ్‌బాస్ సీజన్ 4కు హోస్ట్‌గా వ్యవహరించాడు. 2011లో బిగ్‌బాస్ 5ని సంజయ్‌దత్ హోస్ట్ చేశాడు.