Short News

మహారాష్ట్రలో రూ.9లు తగ్గిన లీటర్ పెట్రోల్ ధర

మహారాష్ట్రలో రూ.9లు తగ్గిన లీటర్ పెట్రోల్ ధర

మహారాష్ట్రలో గురువారం ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.4 నుంచి రూ.9 వరకు తగ్గించారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే పుట్టిన రోజు కావటంతో ఒక్క రోజు తగ్గింపు అమలు చేస్తున్నారు. ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు పెట్రోల్ బంకుల్లో తగ్గింపు ధరలు సరిగ్గా అమలయ్యేలా చూస్తున్నారు. తగ్గించిన మొత్తాన్ని పెట్రోల్ బంకులకు పార్టీ తరఫున ఇవ్వనున్నారు. గురువారం మహారాష్ట్రలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.84.26గా ఉంది. 
'గ‌ర్భ‌వ‌తిని కావ‌డం' గాలి వార్త‌లేః శిల్పాశెట్టి

'గ‌ర్భ‌వ‌తిని కావ‌డం' గాలి వార్త‌లేః శిల్పాశెట్టి

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గర్భం దాల్చిందని సోషల్‌ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా ఓ డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌నుంచి రిపోర్ట్స్‌తో బయటకు వస్తున్న ఆమె ఫొటో సైతం నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది. దీంతో శిల్పాశెట్టే స్వయంగా ఇవన్నీ గాలి వార్తలని కొట్టిపారేసారు. ‘హె భగవాన్.. అలాంటిదేం లేదు!‌, రెగ్యూలర్‌ చెకప్‌లో భాగంగానే నా శరీరానికి సంబంధించిన పరీక్షలను ఎస్‌ఆర్‌ఎల్‌ డయాగ్నస్టిక్స్‌లో చేయించుకున్నాను. అందరూ చేయించుకునే పరీక్షలే. నేను ప్రెగ్నెంట్‌ను కాదు. అవన్నీ గాలి వార్తలే' అని ట్వీట్‌ చేశారు.   
సర్వే: ఎన్నికలొస్తే టీడీపీదే గెలుపు, పవన్ కళ్యాణ్ ప్రభావం ఎం

సర్వే: ఎన్నికలొస్తే టీడీపీదే గెలుపు, పవన్ కళ్యాణ్ ప్రభావం ఎం

ఏపీలో ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీదే గెలుస్తుందట. ఆంధ్రజ్యోతి కోసం మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తరఫున ఆర్జీస్ ఫ్లాష్ టీం సర్వే నిర్వహించిందని చెబుతున్నారు. ఈ సర్వేలో టీడీపీదే గెలుపు అని తేలిందని చెబుతున్నారు. ఎన్నికలు వస్తే టీడీపీ 110, వైయస్సార్ కాంగ్రెస్ 60, ఇతరులు 5 స్థానాల్లో గెలుస్తారని ఈ సర్వేలో తేలిందని అంటున్నారు. సర్వే ప్రకారం.. టీడీపీ, వైసీపీల మధ్య ఓట్ల వ్యత్యాసం 7 శాతంగా ఉండనుంది. వైసీపీ ఓట్లకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీగా గండి కొట్టనున్నారని చెబుతున్నారు.

బాదం తింటే గుండె ఆరోగ్యం ప‌దిలం

బాదం తింటే గుండె ఆరోగ్యం ప‌దిలం

గుండె పది కాలాలపాటు పదిలంగా ఉండాలంటే బాదంపప్పు, జీడిపప్పు వంటి నట్స్‌ను మన ఆహారంలో భాగం చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. తరచూ బాదంపప్పును ఆహారంగా తీసుకోవడం వల్ల హృదయ స్పందనలు గతి తప్పడం, గుండె వైఫల్యం చెందే ముప్పు తగ్గుతుందని స్వీడన్‌కు చెందిన కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది. విన్నారు క‌దా.. గుండె జ‌బ్బులున్న‌వారు, గుండె ఆరోగ్యంపై శ్ర‌ద్ధ చూపేవారు బాదం ప‌ప్పుపై ఇష్టం పెంచుకోండి మరీ!   
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more