Short News

8.55% ఈపీఎఫ్‌ఓ వడ్డీరేటుపై వివాదం లేదు

8.55% ఈపీఎఫ్‌ఓ వడ్డీరేటుపై వివాదం లేదు

ఈపీఎఫ్ సంస్థలోని 5 కోట్ల మంది చందాదార్లకు 2017-18 ఆర్థిక సంవత్సరానికి 8.55 శాతం వడ్డీరేటు ఇవ్వాలనుకోవడంపై ఆర్థిక శాఖతో భేదాభిప్రాయం ఏమీ లేదని కార్మిక మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పేర్కొన్నారు. తమ చందాదార్ల నిధులపై 2017-18కి 8.55 శాతం వడ్డీ చెల్లించాలని ఈపీఎఫ్‌ఓ నిర్ణయాధికార సంఘమైన కేంద్ర ధర్మకర్తల మండలి ఫిబ్రవరి 21న నిర్ణయించింది. ఆమోదం కోసం ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖకు పంపింది. దీన్ని ఆర్థిక శాఖ తిరస్కరించలేదని, తిరస్కరిస్తే ఇప్పటికే తమకు సమాచారం అందేదని గంగ్వార్‌ తెలిపారు. మే లేదా జూన్‌లలో ఈ ప్రతిపాదన ఖరారవ్వవచ్చని వివరించారు.
క‌ర్ణాట‌క‌లో మ్యానిఫెస్టోల ప్ర‌క‌ట‌న‌కు సిద్ధ‌మ‌వుతున్న పార్టీలు

క‌ర్ణాట‌క‌లో మ్యానిఫెస్టోల ప్ర‌క‌ట‌న‌కు సిద్ధ‌మ‌వుతున్న పార్టీలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. మేనిఫెస్టోలు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఓటర్ల నాడి తెలుసుకునేందుకు అనుభవజ్ఞులైన నాయకులను రంగంలోకి దింపడం ద్వారా విజయానికి బాటలు వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రమంతటికీ ఒకటి, నియోజక వర్గానికి ఒకటి చొప్పున మేనిఫెస్టోలు రూపొందించనున్నట్లు బీజేపీ అధికార ప్రతినిధి వామన్‌ ఆచార్య తెలిపారు. మంగళూరులో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుబ్రహ్మణ్య నేతృత్వంలో జేడీఎస్ మ్యానిఫెస్టో రూపొందించ‌నుంది.     
ఫేస్‌బుక్‌, అనలిటికాకు మరోమారు నోటీసులు

ఫేస్‌బుక్‌, అనలిటికాకు మరోమారు నోటీసులు

ఫేస్‌బుక్‌ వినియోగదారుల వ్యక్తిగత వివరాల దుర్వినియోగంపై కేంబ్రిడ్జి అనలిటికా, ఫేస్‌బుక్‌ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మరోమారు నోటీసులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులకు కేంబ్రిడ్జ్‌ అనలిటికా అస్పష్ట సమాధానం ఇచ్చిన నేపథ్యంలో కేంద్రం రెండు సంస్థలపై మరోసారి ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడం వంటి పనులకు భారతీయుల వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం కాకుండా నివారించేందుకు ఎలాంటి భద్రతా చర్యలు చేపడుతున్నారో చెప్పాలని ఫేస్‌బుక్‌ను కోరింది. సమాచారం దుర్వినియోగం చేసేవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వివరించాలని సూచించింది.
నేను ఉండగా.. ఎలా?: బాబు ముందు అఖిలప్రియ ప్రశ్నలు!

నేను ఉండగా.. ఎలా?: బాబు ముందు అఖిలప్రియ ప్రశ్నలు!

కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య నెలకొన్ని విభేదాల పరిష్కారంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం చంద్రబాబుతో భేటీకి రానీ అఖిల.. గురువారం అమరావతికి బయలుదేరారు.బుధవారం అఖిలప్రియ రాకపోవడంతో ఈ సమావేశం వాయిదాపడింది. చంద్రబాబుతో భేటీకి బుధవారమే ఏవీ సుబ్బారెడ్డి ఉండవల్లికి చేరుకున్నారు. కానీ అఖిల గురువారం వస్తానని చెప్పారు.