Short News

పీఎఫ్‌ క్లైయిమ్ నిబంధ‌న‌ల స‌వ‌ర‌ణ‌

పీఎఫ్‌ క్లైయిమ్ నిబంధ‌న‌ల స‌వ‌ర‌ణ‌

లక్షలాది పీఎఫ్‌ చందాదారులకు ఊరట కలిగించేలా ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో తాను జారీ చేసిన నిబంధనలను సవరిస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం రూ.10 లక్షలు దాటిన పీఎఫ్‌ క్లైయిమ్‌ల‌ను కూడా ఆఫ్‌ లైన్‌లో దాఖలు చేయొచ్చు. పీఎఫ్‌ క్లైయిమ్స్‌, పెన్షన్‌ స్కీమ్స్‌ ఉపసంహరణలపై గతంలోని నిబంధనల్లో మార్పు చేస్తూ ఏప్రిల్‌ 13న ఈపీఎఫ్‌ఓ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.    
లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఆసియా మార్కెట్‌లో సానుకూల సంకేతాలు ఇందుకు దోహదపడ్డాయి. రిఫైనరీ, క్యాపిటల్‌ గూడ్స్‌, హెల్త్‌కేర్‌, ఆటో, బ్యాంకింగ్‌ రంగంలో షేర్లు లాభపడటంతో సూచీలు లాభపడ్డాయి. ఉదయం వందకు పైగా పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ లాభాల జోరు కొనసాగించింది. చివరకు 165.87 పాయింట్ల లాభంతో 34,616.64 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి 29.65 పాయింట్ల లాభంతో 10614.35 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.37వద్ద ట్రేడవుతోంది.   
మూడోసారి తండ్రైన బ్రిట‌న్ రాకుమారుడు

మూడోసారి తండ్రైన బ్రిట‌న్ రాకుమారుడు

బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ విలియం, కేట్‌ మిడిల్‌టన్‌ దంపతులకు సోమవారం కుమారుడు జన్మించినట్లు కెన్సింగ్‌టన్ ప్యాలెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. దాంతో పాటు కొన్ని ఫొటోలు కూడా విడుద‌ల చేసింది. ఇప్పటికే ఈ దంపతులకు ఒక బాబు(ప్రిన్స్‌ జార్జి), పాప(ప్రిన్సెస్‌ ఛార్లెట్‌)ఉన్నారు. తాతయ్య ప్రిన్స్‌ ఛార్లెస్‌, తండ్రి ప్రిన్స్ విలియమ్స్‌, సోదరుడు ప్రిన్స్‌ జార్జి, అక్క ప్రిన్సెస్‌ ఛార్లెట్‌ తర్వాత రాజ సింహాసనానికి ఈ నవజాత శిశువుకు వారసుడయ్యే హక్కు ఉంది.   
పవన్ కళ్యాణ్ తాజా ట్వీట్:బొంబాయిలో అంతే...బొంబాయిలో అంతే

పవన్ కళ్యాణ్ తాజా ట్వీట్:బొంబాయిలో అంతే...బొంబాయిలో అంతే

పవన్ కళ్యాణ్ ట్వీట్ల యుద్దం నిరాటంకంగా కొనసాగుతోంది. కొన్ని గంటల క్రితం టిడిపి మద్దతు ఛానెల్స్ కు, విభాగాధిపతులకు, షేర్ హోల్డర్లకు, పెట్టుబడిదారులకు లీగల్ నోటీసులు పంపుతున్నట్లు వెల్లడించిన పవన్ తాజాగా మరో ట్వీట్ చేశాడు. ప్రముఖ పత్రిక, ఛానెల్ ఎండీని లక్ష్యంగా చేసుకొని ఆయన ఇటీవల రాసిన ఒక కాలమ్ ను ఎద్దేవా చేస్తూ ఈ ట్వీట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ తల్లిని దూషించే తిట్టు పల్లెటూళ్లో చాలా సర్వసాధారణం అని బూతురత్నం అంటున్నాడంటూ...అందుకు ఒక సినిమాలో కమెడియన్ బొంబాయిలో అంతే అనే మేనరిజాన్నివాడిన తీరును పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.