Short News

'జమ్మూలో దౌలతుల్ ఇస్లాం కార్యకలాపాలు'

'జమ్మూలో దౌలతుల్ ఇస్లాం కార్యకలాపాలు'

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో దౌలతుల్ ఇస్లాం కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లోని ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నా మహిళా గ్రూప్ ఐసీస్ సిద్దాంతాలను బలపరుస్తూ ప్రసంగాలు చేస్తున్నాయని కేంద్ర హోంశాఖమంత్రిత్వశాఖ నివేదికను వెల్లడించింది. జమ్మూ రాష్ట్రంలోని ఐసిస్ అనుకూల మహిళా గ్రూప్ దౌలతుల్ ఇస్లాం కదలికలు కలకలం రేపుతున్నాయి. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన నివేదికతో ఆ రాష్ట్రం అప్రమత్తమైంది.

రామ మందిరం తీర్పు అనుకూలంగా రాకుంటే ఆత్మాహుతులు!

రామ మందిరం తీర్పు అనుకూలంగా రాకుంటే ఆత్మాహుతులు!

బీజేపీ సీనియర్ నేత వినయ్ కటియార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామ మందిరం కేసులో సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రాకుంటే ఆత్మాహుతి దళాలు (బలిదానీ దాస్తా) రంగంలోకి దిగుతాయని హెచ్చరించారు. సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనంత వరకు ఈ దళాలు ముందుకు రావు, అయితే వాటికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలైంది అని లక్నోలో ఆయన మీడియాతో చెప్పారు. బాబ్రీ మసీదు కేసులో పిటిషనర్‌గా ఉన్న ఇక్బాల్ అన్సారీకి ఈ వివాదంపై పూర్తి అవగాహన లేదని కటియార్ చెప్పారు. కటియార్ బాబ్రీ మసీదు కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు.    
పదిమందితో జియో ఫోన్ కొనిపిస్తే ..112 జీబీ డేటా ఉచితం

పదిమందితో జియో ఫోన్ కొనిపిస్తే ..112 జీబీ డేటా ఉచితం

రిలయన్స్‌ జియో వినియోగదారులకు బంపర్‌ఆఫర్‌ ప్రకటించింది. ఈసారి ఉచిత డేటా ఆఫర్‌ ప్రకటించింది. 'జియో ఫోన్‌ మ్యాచ్‌ పాస్‌' ఆఫర్లో వినియోగదారులు మరో 10మంది చేత జియో ఫోన్లను కొనిపిస్తే 112 జీబీ డేటాను ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్‌ మే 27వ తేదీవరకు మాత్రమే చెల్లుతుంది. 10మంది స్నేహితులు లేదా, బంధువులను జియో ఫోన్‌ కొనుగోలు చేయించాల్సి ఉంటుంది. 1800-890-8900 టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేసి జియో ఫోన్‌పై ఆసక్తి ఉన్న స్నేహితుల గురించి సమాచారం ఇవ్వాలి.  
13,000 mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ లాంచ్, ధర, హైలెట్ ఫీచర్లు ఇవే

13,000 mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ లాంచ్, ధర, హైలెట్ ఫీచర్లు ఇవే

మొబైల్ మార్కెట్లో మరో సంచలనం నమోదైంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో దిగ్గజాలకు సవాల్ విసురుతూ అతి పెద్ద బ్యాటరీ ఫోన్ దూసుకొచ్చింది. మొబైల్ దిగ్గజం యూల్‌ఫోన్ తన నూతన స్మార్ట్‌ఫోన్ పవర్ 5 ను మార్కెట్లోకి విడుదల చేసింది. షియోమి, ఆపిల్, శాంసంగ్, ఎల్‌జి, హువాయి, ఒప్పో లాంటి కంపెనీలకు సవాల్ విసురుతూ అదిరే ఫీచర్లు భారీ బ్యాటరీతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఇందులో 6 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. అలాగే 13000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.