Short News

ఆ రైలు మార్గానికి  త్వ‌ర‌లో ర‌క్ష‌ణ గోడ‌

ఆ రైలు మార్గానికి త్వ‌ర‌లో ర‌క్ష‌ణ గోడ‌

ముంబయి -దిల్లీ మార్గంలో రైలు ప్రయాణం మరింత వేగవంతం కానుంది. ప్రమాదాలు కూడా తగ్గనున్నాయి. ఇందుకోసం దాదాపు 500 కిలో మీట‌ర్ల‌ పొడవునా రైలు పట్టాలకు ఇరు వైపులా రక్షణ గోడను నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. రైల్వే ట్రాక్‌పైకి తరచుగా మనుషులు, పశువులు రావడంతో అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీంతో రైళ్ల వేగం తగ్గుతోంది. రక్షణ గోడ నిర్మాణం ద్వారా.. ఇలాంటి పరిస్థితులను నియంత్రించవచ్చని రైల్వే సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 
ఎయిర్‌టెల్ లో రూ.49కే 3జీబీ 4జీ డేటా

ఎయిర్‌టెల్ లో రూ.49కే 3జీబీ 4జీ డేటా

కస్టమర్లను ఆకట్టుకోవడంలో ఎయిర్‌టెల్, జియో పోటీపడుతున్నాయి. తాజాగా జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.49కే 3జీబీ 4జీ డేటాను ఉచితంగా అందిస్తున్నది. ఈ ప్లాన్ వాలిడిటీ కేవలం ఒక్క రోజు మాత్రమే. అయితే ఈ ప్లాన్ కేవలం ఎంపిక చేసిన సర్కిల్స్‌లో ఉన్న కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. ఎయిర్‌టెల్ యాప్ ఓపెన్ చేసి అందులో ప్లాన్ల వివరాలను చూసుకోకుంటే వాటిల్లో.. రూ.49కి 3జీబీ డేటా అని ఉంటుంది. ప్లాన్ అందుబాటులో లేకపోతే రూ.49కు కేవలం 1జీబీ డేటా మాత్రమే వస్తుందని తెలిపింది.
పోస్టుమార్టమ్ బయటపెట్టిన దారుణాలు..: కథువా చిన్నారిని ఎంతలా

పోస్టుమార్టమ్ బయటపెట్టిన దారుణాలు..: కథువా చిన్నారిని ఎంతలా

కథువా రేప్ కేసు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై మృగాళ్లు జరిపిన హత్యాచారం అత్యంత పాశవికం. నిందితులు ఆ చిన్నారిని ఏ స్థాయిలో చిత్రహింసలు పెట్టారో 'పోస్టుమార్టమ్' నివేదికలో వెల్లడైంది. గుండె తరుక్కుపోయే రీతిలో ఉన్న ఆ వాస్తవాలను జాతీయ మీడియా వెలుగులోకి తెచ్చింది. చిన్నారి జననాంగం ఛిద్రమైపోయిందని, జననాంగం లోపల రక్తపు మరకలు గుర్తించామని, ఆమె ఉదరభాగం, అవయవాలు నీలి రంగులోకి మారిపోయాయని పోస్టుమార్టమ్ నివేదికలో వెల్లడైంది.

శ్రీరెడ్డికి పెళ్లికాకుండానే.. సంచలనం రేపుతున్న కరాటే కల్యాణి లీక్స్

శ్రీరెడ్డికి పెళ్లికాకుండానే.. సంచలనం రేపుతున్న కరాటే కల్యాణి లీక్స్

క్యాస్టింగ్ కౌచ్, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు కల్పించాలని ఉద్యమం చేస్తున్న శ్రీరెడ్డికి సంబంధించిన కొన్ని విషయాలను నటి కరాటే కల్యాణి బయటపెట్టడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో కల్యాణి షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇటీవల ఓ టెలివిజన్ ఛానెల్‌లో చర్చ సందర్భంగా శ్రీరెడ్డి, కల్యాణి మధ్య వివాదం చోటుచేసుకొన్న సంగతి తెలిసిందే. ఆ సయయంలో శ్రీరెడ్డి గొంతు పిసికి కల్యాణి చంపబోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డిపై కల్యాణి సంచలన విషయాలు బయటపెట్టారు.