Short News

భారత్‌లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?

భారత్‌లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'సుజుకి మోటార్‌సైకిల్' దేశీయ విఫణిలో కొత్త బైక్ 'వీ-స్ట్రోమ్ 800డీఈ' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ ధర, డిజైన్, ఫీచర్స్, డెలివరీ వంటి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.ధర (Price) సుదీర్ఘ నిరీక్షణ తరువాత దేశీయ మార్కెట్లో అడుగుపెట్టయిన కొత్త సుజుకి వీ-స్ట్రోమ్ 800డీఈ (Suzuki V-Strom 800DE) ప్రారంభ ధర రూ. 10.30 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ కేవలం పరిచయ ధర మాత్రమే, కాబట్టి రాబోయే రోజుల్లో ఎప్పుడైనా ఈ ధర పెరిగే అవకాశం ఉంది. కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
భారత్‌లో లభించే బెస్ట్ బైకులు - ధర రూ.5 లక్షల కంటే తక్కువే..

భారత్‌లో లభించే బెస్ట్ బైకులు - ధర రూ.5 లక్షల కంటే తక్కువే..

మార్కెట్లో టూ-వీలర్స్ సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. భారత్‌లో రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల కంటే ఎక్కువ ధర కలిగిన బైకులు లభిస్తాయి. ఈ కథనంలో రూ.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు గురించి తెలుసుకుందాం.దేశీయ విఫణిలో రూ. 5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకుల జాబితాలో ప్రధానంగా.. రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ650, కేటిఎమ్ 390 డ్యూక్, కేటిఎమ్ RC 390, యమహా ఆర్3, ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 మరియు ట్రయంఫ్ స్పీడ్ 400 వంటివి ఉన్నాయి. ఇవన్నీ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ధర కూడా రూ. 5 లక్షల కంటే తక్కువగానే ఉంటాయి.
ముంబయి- అహ్మదాబాద్‌ బుల్లెట్ ట్రైన్‌ కోసం ‘బాలస్ట్‌లెస్‌' ట్రాక్‌

ముంబయి- అహ్మదాబాద్‌ బుల్లెట్ ట్రైన్‌ కోసం ‘బాలస్ట్‌లెస్‌' ట్రాక్‌

భారత్‌లో త్వరలో బుల్లెట్ రైళ్లు(Bullet Trains) అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం చైనా, జపాన్ వంటి కొన్ని దేశాల్లో మాత్రమే బుల్లెట్ రైళ్లు నడుస్తుండగా.. ఈ దేశాల సరసన త్వరలో భారత్ కూడా చేరనుంది. ఈ క్రమంలో బుల్లెట్‌ రైలుకు సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి ఆసక్తికర వీడియోను షేర్‌ చేశారు.
ఏథర్‌ రిజ్టా ప్రీ బుకింగ్‌లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు..

ఏథర్‌ రిజ్టా ప్రీ బుకింగ్‌లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు..

కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రముఖ టూ వీలర్‌ తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ(Ather Energy) గుడ్‌ న్యూస్‌ తీసుకువచ్చింది. ఏథర్‌ ఎనర్జీ నుంచి భారీ అంచనాలతో త్వరలో విడుదల కాబోతున్న ఫ్యామిలీ స్కూటర్‌ రిజ్టా(Ather Rizta)కు సంబంధించి ప్రీ బుకింగ్‌లను సంస్థ ప్రారంభించింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..