Short News

‘హిందూ పాకిస్తాన్’ వాఖ్యలపై క్షమాపణ చెప్పను

‘హిందూ పాకిస్తాన్’ వాఖ్యలపై క్షమాపణ చెప్పను

బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే భారత్‌ను హిందూ పాకిస్తాన్‌గా మారుస్తుందన్న తన వ్యాఖ్యలను సీనియర్‌ కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ సమర్ధించుకున్నారు. థరూర్‌ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలన్న బీజేపీ డిమాండ్‌ను శశి థరూర్‌ తోసిపుచ్చారు. బీజేపీ, ఆరెస్సెస్‌ల మూల సిద్ధాంతాన్నే తాను ప్రస్తావించానని, హిందూ రాష్ట్ర భావనపై వారికి విశ్వాసం లేదని స్పష్టంగా ప్రకటిస్తే చర్చ ముగుస్తుందని అన్నారు. వారి సిద్ధాంతానికి అనుగుణంగా తాను వ్యాఖ్యానిస్తే క్షమాపణ చెప్పడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
కొత్త చట్టం: కొత్తగా తల్లయిన మహిళా ప్రజాప్రతినిధులు

కొత్త చట్టం: కొత్తగా తల్లయిన మహిళా ప్రజాప్రతినిధులు

ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల పార్లమెంట్లు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టే యోచనలో ఉన్నాయి. అప్పుడే తల్లి అయినా మహిళా ప్రజా ప్రతినిధులు తమ చంటి పిల్లలను పార్లమెంటు సమావేశాలకు తీసుకొచ్చేలా చట్టం తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. తద్వారా పార్లమెంటుతో పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఫ్రెండ్లీ వాతావరణం కల్పించినట్లు అవుతుందని భావిస్తున్నాయి. గత నెల 21న న్యూజిలాండ్ ప్రధాని జాసిండా ఆర్డ్రన్ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డ బాగోగులు ఓ వైపు చూస్తూనే పాలనపై కూడా దృష్టి సారించాల్సి వస్తోంది. అంతేకాదు కీలకమైన చట్టాలు

పవన్ కళ్యాణ్ ఓ గోల్ సెట్ చేసుకున్నారు.. కోనవెంకట్!

పవన్ కళ్యాణ్ ఓ గోల్ సెట్ చేసుకున్నారు.. కోనవెంకట్!

ప్రముఖ రచయిత కోనవెంకట్ నుంచి వస్తున్న మరో విభిన్న చిత్రం నీవెవరో. ఆది పినిశెట్టి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. రితిక సింగ్, తాప్సి హీరోయిన్స్. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. చూస్తుంటే ఈ చిత్రం రివేంజ్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి కోనవెంకట్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. హరినాథ్ ఈ చిత్రానికి దర్శకుడు. కోనవెంకట్ ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలకు డైలాగ్స్ అందించారు.

తమిళ లీక్స్: నటి ఖుష్బూ భర్తపై శ్రీరెడ్డి సంచలనం, సెక్సువల్‌గా....

తమిళ లీక్స్: నటి ఖుష్బూ భర్తపై శ్రీరెడ్డి సంచలనం, సెక్సువల్‌గా....

కాస్టింగ్ కౌచ్ విషయంలో టాలీవుడ్లో పలువురు భాగోతాలు బయట పెట్టిన శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ ప్రముఖుల విషయాలు బయట పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏఆర్ మురుగదాస్, శ్రీకాంత్, రాఘవ లావరెన్స్ లాంటి వ్యక్తుల పేర్లు బయట పెట్టి కోలీవుడ్లోనూ ప్రకంపణలు మొదలయ్యేలా చేసింది. తాజాగా శ్రీరెడ్డి తమిళ దర్శకుడు, ప్రముఖ నటి ఖుష్భూ భర్త సుందర్ సి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను నోవాటెల్ హోటల్‌కు పిలిచి సెక్సువల్‌గా కాంప్రమైజ్ కావాలని అడిగాడని ఆమె ఆరోపించారు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more