Short News

'ఏక ప‌క్ష వాద‌న ఆధారంగా అరెస్ట్ చేయ‌కూడ‌దు'

'ఏక ప‌క్ష వాద‌న ఆధారంగా అరెస్ట్ చేయ‌కూడ‌దు'

ఒక పక్షం వినిపించే వాదన ఆధారంగా ఏ వ్యక్తినైనా అరెస్టు చేయరాదని సుప్రీం కోర్టు బుధవారం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ దురాగతాల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు మార్చి 20న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ స్పష్టతనిచ్చింది. సమాజంలో ఉన్నవారందరికీ సమాన స్వేచ్ఛ, న్యాయమైన విధానాలు అమలయ్యేలా జాగ్రత్త వహించాల్సిన‌ బాధ్యత కోర్టుకు ఉందని పేర్కొంది. భారతదేశ రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం ప్రజలకు లభిస్తున్న ప్రాణ రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను నిరాకరించే చట్టాన్ని పార్లమెంటు చేయజాలదని వివరించింది.
ఆది పినిశెట్టి, తాప్సీ మూవీ లాంచ్ చేయబోతున్న నాని

ఆది పినిశెట్టి, తాప్సీ మూవీ లాంచ్ చేయబోతున్న నాని

కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా బేనర్లో నాని హీరోగా తెరకెక్కిన 'నిన్ను కోరి' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. ఈ చిత్రం అందించిన విజయంతో మరో సినిమాకు సిద్ధమవుతున్నారు చిత్ర నిర్మాతలు. ఆది పనిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా వారు మరో సినిమా నిర్మించబోతున్నారు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ మే 24న చేయబోతున్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

బయోపిక్ పై స్పందించిన సానియా మీర్జా

బయోపిక్ పై స్పందించిన సానియా మీర్జా

బాలీవుడ్ ,టాలీవుడ్ లో బయోపిక్స్  ట్రెండ్ నడుస్తోంది. సావిత్రి బయోపిక్ ఇప్పటికే విడుదలై ప్రశంసలు పొందుతుండగా త్వరలో ఎన్టీఆర్ బయోపిక్ తెరపైకి రానుంది. మరోవైపు క్రికెటర్ల బయోపిక్ కూడా తెరకెక్కబోతున్నాయి. సౌరవ్ గంగూలీ బయోపిక్ పై వార్తలు వెలువుడుతున్నాయి. టెన్నిస్ స్టార్ సానియామీర్జా బయోపిక్‌ను సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై స్పందించిన సానియా బయోపిక్‌పై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ... అయితే అధికారికంగా ఇంకా స్పష్టతకు రాలేదని క్లారిటీ ఇచ్చింది సానియా.
ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన భార్య

ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన భార్య

అనంతపురం:అనంతపురం జిల్లా సోమందేపల్లి గ్రామంలో కొత్తపల్లి మలుపు ప్రాంతానికి చెందిన వడ్డె రాము, లక్ష్మీదేవి దంపతులు ప్రధాన రహదారి పక్కనే ఓ హోటల్‌ నిర్వహిస్తున్నారు. హోటల్ నిర్వహణ భార్య లక్ష్మీదేవి చూస్తుండగా హోటల్ పై వచ్చే ఆదాయం సరిపోవడం లేదని భర్త కూలీ పనులకు వెళుతున్నాడు. ఇలా వీరు తమ సంపాదనతో ఇద్దరు పిల్లలను సాకుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వీరి హోటల్‌కు మినరల్ వాటర్ సప్లయి చేసే వాహనం డ్రైవర్ చల్లాపల్లి అశోక్‌తో లక్ష్మీదేవికి .