Short News

మృతురాలి కుటుంబానికి రక్షణ కల్పించాలి: సుప్రీం

మృతురాలి కుటుంబానికి రక్షణ కల్పించాలి: సుప్రీం

కథువా అత్యాచార ఘటనలో మృతురాలి కుటుంబానికి రక్షణ కల్పించాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సోమవారం నాడు నోటీసులు జారీ చేసింది. అదే విధంగా ఈ కేసును వాదిస్తున్న న్యాయవాది దీపిక ఎస్. రాజావత్‌కు కూడ రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. కథువాలో ఎనిమిదేళ్ళ మైనర్ బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో తనకు రక్షణ కల్పించాలని మృతురాలి తండ్రి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై సుప్రీంకోర్టు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి సోమవారం నాడు నోటీసులు ఇచ్చింది.

గేల్ స్పీడ్ కు బ్రేకులు వేస్తాం

గేల్ స్పీడ్ కు బ్రేకులు వేస్తాం

గేల్ స్పీడ్ కు బ్రేక్ లు వేస్తామన్నారు కోల్‌కతా బౌలింగ్ కోచ్ హీత్ స్ట్రీక్. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ఓపెనర్ క్రిస్‌గేల్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టామని కోల్‌కతా బౌలింగ్ కోచ్ హీత్ స్ట్రీక్ తెలిపారు. గేల్ లాంటి ఆటగాళ్లు క్రీజులో నిలదొక్కుకుని లయ, ఆత్మవిశ్వాసాన్ని అందిపుచ్చుకుంటే.. అతను మరింత ప్రమాదకారిగా మారుతాడని అన్నారు తన పరిధిలోకి బంతి వచ్చిందంటే తన సామర్థ్యాన్ని కూడగట్టుకొని సునాయాసంగా బౌండరీలు బాదగలడని అన్నారు.
'ఒక్క ఫోటో' అతని జీవితాన్నే మార్చేసింది..

'ఒక్క ఫోటో' అతని జీవితాన్నే మార్చేసింది..

కేరళలోని త్రిసూర్ 'వైట్ ర్యాంప్' అనే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ గ్రూపులో విష్ణు ఒక సభ్యుడు. ఏప్రిల్ 15న త్రిసూరులో 'షియాజ్-నవ్య'ల పెళ్లిని కవర్ చేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో కొన్ని ఫోటోలు కొత్తగా ట్రై చేద్దామని.. కొత్త జంటను చెట్టు కింద తలకిందులుగా నిలబెట్టి.. చెట్టుపై అతను తలకిందులుగా వేలాడుతూ ఫోటోలు తీశాడు.అతను తీసిన ఫోటోలు అద్భుతంగా రావడం.. అతనలా చెట్టుకు వేలాడుతూ ఫోటోలు తీస్తుంటే మరొకరు వీడియో తీయడం.. ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఓవర్ నైట్ దేశవ్యాప్తంగా ఎవరా ఫోటోగ్రాఫర్? అన్న చర్చ మొదలైంది.

నెల్లూరులో బిజెపి, టిడిపి నేతల పరస్పర దాడులు...ఉద్రిక్తత

నెల్లూరులో బిజెపి, టిడిపి నేతల పరస్పర దాడులు...ఉద్రిక్తత

నెల్లూరు:బిజెపి, టిడిపిల మధ్య మాటల యుధ్దం ముదిరి ఘర్షణలకు దారితీసింది. శుక్రవారం విజయవాడలో ప్రధాని మోడీ నుద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై బిజెపి శ్రేణులు రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నెల్లూరులో బిజెపి నేతలు నిరసన చేపట్టారు. మోడీపై వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి శ్రేణులు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద బాలకృష్ణ దిష్టి బొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించాయి. అదే సమయంలో మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు టిడిపి శ్రేణులు అదే ప్రాంతానికి చేరుకున్నాయి.