Short News

ఛత్తీస్‌గఢ్ సీఎంకు, ఆయన కుమారునికి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్!

ఛత్తీస్‌గఢ్ సీఎంకు, ఆయన కుమారునికి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్!

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, ఆయన కుమారుడు అభిషేక్ సింగ్‌లకు మంగళవారం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. పదేళ్ల క్రితం జరిగిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో ముడుపులు అందాయనే ఆరోపణల నుంచి వారు విముక్తులయ్యారు.
ఈ ఒప్పందంలో అక్రమాలు జరిగాయని స్వరాజ్ అభియాన్ అనే ఎన్‌జీవో, ఇతరులు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. అయితే పిటిషనర్లు చేసిన ఆరోపణలను జస్టిస్ ఆదర్శ్ కే గోయల్, జస్టిస్ ఉదయ్ యూ లలిత్ ధర్మాసం తోసిపుచ్చింది.

నెక్స్ట్ ప్రాజెక్టు ఏంటనేది నేనే చెబుతా

నెక్స్ట్ ప్రాజెక్టు ఏంటనేది నేనే చెబుతా

నాగచైతన్య, రకుల్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుందనీ, గతంలో కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన సౌజన్య ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం కానుందనే వార్త ఈ రోజు ఉదయం నుంచి హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం చైతూ చేస్తోన్న సినిమాలు పూర్తికాగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ ప్రచారంపై నాగచైతన్య స్పందిస్తూ ఇందులో ఎంతమాత్రం నిజం లేదని చెప్పాడు. తదుపరి ప్రాజెక్టు ఏమిటనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తాననీ ఎలాంటి ప్రచారాలు నమ్మొద్దని స్పష్టం చేసాడు.  
బాబుతో కమల్ హాసన్ భేటీ?: మోడీకి చెక్, ఢిల్లీలో 'దక్షిణ' చక్ర

బాబుతో కమల్ హాసన్ భేటీ?: మోడీకి చెక్, ఢిల్లీలో 'దక్షిణ' చక్ర

2019 ఎన్నికల నేపథ్యంలో దక్షిణాదిన అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీకి చెక్ చెప్పేందుకు కొన్ని పార్టీలు ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే కావొచ్చునని అంటున్నారు.దక్షిణాది రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రంలో ఆయా ప్రాంతీయ పార్టీకి పట్టు ఉంది. ఏపీలో టీడీపీ, వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్, కర్నాటకలో జేడీఎస్, తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకేలకు పట్టు ఉంది. అయితే సౌతిండియాపై కన్నేసిన నేపథ్యంలో సంయుక్తంగా చెక్ పెట్టే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

'రేణూ దేశాయ్‌' జ్ఞాపకాల్లో పవన్ కళ్యాణ్.?
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/avG2pnV3sWg" frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe>

'రేణూ దేశాయ్‌' జ్ఞాపకాల్లో పవన్ కళ్యాణ్.?

నటి, దర్శకురాలు రేణూ దేశాయ్‌ తాజాగా ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసారు. దానిలో ఏమన్నారంటే, 'నాలోని జ్ఞాపకాలన్నింటినీ వెలికితీసాను. ఆయన మాటలు, పదాలు, ఆయన పేరు చెక్కిన కలం నా జ్ఞాపకాల్లో నిక్షిప్తమయ్యాయి. కానీ కమ్ముకున్న హిమం కరిగిపోయి మళ్ళీ ఆ జ్ఞాపకాలు కళ్ళెదుట నిలిచాయి. తిరిగి చూసుకుంటే తుప్పు పట్టిన కలం, పేరు తుడిచిపెట్టుకుపోయాయి. ముక్కలైన నా హృదయం, నేను రాసుకున్న లేఖల కాగితపు ముక్కలు కన్పించాయని పేర్కొంది.