Short News

త‌లుపు తెర‌వ‌గానే  'చేష్ట‌లు' మొదలుపెట్టాడు

త‌లుపు తెర‌వ‌గానే 'చేష్ట‌లు' మొదలుపెట్టాడు

దిల్లీలో తైక్వాండో ట్రైనర్‌గా పనిచేస్తోన్న ఓ వ్యక్తి ప‌రిచ‌య‌స్తురాలితో అస‌భ్యంగా  ప్ర‌వ‌ర్తించాడు. సీసీ టీవీ కెమెరాల్లో నిక్షిప్త‌మైన అత‌డి చేష్ట‌ల‌ను గ‌మ‌నించిన పోలీసులు విస్తుపోయారు. నిందితుడు వసంత్‌ కుంజ్‌లో త‌న‌కు తెలిసిన మ‌హిళ‌ను క‌ల‌వ‌డానికి ఆమె ఇంటికి వెళ్లి బెల్ మోగించాడు. స‌ద‌రు మహిళ త‌లుపు తెర‌వ‌గానే ప్యాంట్ విప్పేసి ఆమెను చెరపట్టే ప్రయత్నం చేశాడు. క్ష‌ణాల్లో తేరుకున్న బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్క‌డి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.   
గవర్నర్‌పై చంద్రబాబు షాకింగ్: తెరపైకి 'పవన్ కళ్యాణ్'

గవర్నర్‌పై చంద్రబాబు షాకింగ్: తెరపైకి 'పవన్ కళ్యాణ్'

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌పై టీడీపీ నేతలు మంగళవారం నిప్పులు చెరిగారు. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల్లో గవర్నర్ కీలక పాత్ర పోషిస్తున్నారని, టీడీపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలను ఏకం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు. అసలు గవర్నర్ వ్యవస్థ ఎందుకని కూడా టీడీపీ నేతలు ప్రశ్నించారు. గవర్నర్ నరసింహన్ మొదటి నుంచి టీడీపీకి వ్యతిరేకమని ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గవర్నర్ అంశాన్ని ప్రస్తావించారు.

రూ.2,253 కోట్ల హవాల రాకెట్ గుట్టురట్టు

రూ.2,253 కోట్ల హవాల రాకెట్ గుట్టురట్టు

ముంబైలో హవాలా రాకెట్ గుట్టురట్టయింది. మహ్మద్‌ ఫరూక్‌ అలియాస్‌ ఫరూక్‌ షేక్‌ అనే వ్యక్తి దాదాపు రూ.2,253 కోట్ల మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. మనీ లాండరింగ్‌ నివారణ చట్టం కింద ఫరూక్‌ను అధికారులు అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. నకిలీ దిగుమతి డాక్యుమెంట్ల ద్వారా కోట్ల రూపాయలను విదేశాలకు తరలించడానికి ఫరూక్‌ 13 కంపెనీలను వాడినట్టు ఆరోపణలు ఉన్నాయి. అతన్ని ఏప్రిల్‌ 26 వరకు ఈడీ తన కస్టడీలోకి తీసుకుంది.
మహానటి సినిమా లేటెస్ట్ న్యూస్, చిత్ర యూనిట్ అంతా ఒక్క చోటికి!

మహానటి సినిమా లేటెస్ట్ న్యూస్, చిత్ర యూనిట్ అంతా ఒక్క చోటికి!

మహానటి సినిమాలో నటించిన నటీనటుల పాత్రలు త్వరలో పోస్టర్స్ ద్వారా విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. మే ఒకటిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ''తరాలను నిర్మించే స్త్రీ జాతి కోసం.. తరతరాలు గర్వించే కథ మహానటి సావిత్రి కథ''. తన అంద చందాలతోనే కాదు, గుణగణాలతోను ఇప్పటికీ తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటి మహానటి సావిత్రి. ఈ మహానటి రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను ఎందరికో స్పూర్తిదాయకంగా నిలిచింది.