Short News

ఇవి తీసుకుంటే నిత్యం 'యవ్వనమే'

ఇవి తీసుకుంటే నిత్యం 'యవ్వనమే'

నేటి కాలంలో పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా సౌందర్యాన్ని పెంచుకోవడంపై శ్రద్ధ వహిస్తున్నారు. ఈ క్రమంలో మనకు అందుబాటులో ఉన్న కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించవచ్చు. వైన్, పుచ్చకాయలు, బ్లూబెర్రీలు, అవకాడోలు, నిమ్మకాయలు, ఆలివ్ ఆయిల్, గ్రీన్ టీ, ఆకుపచ్చని కూరగాయలు, వెల్లుల్లి, చేపలు, క్యారెట్లు, టమోటా, కొబ్బరినూనె తదితరాల్లోనూ యాంటీ ఏజింగ్ గుణాలు పుష్క‌లంగా ఉన్నాయి.  
భారత్‌లో అతిపెద్ద మొబైల్‌ టవర్‌ కంపెనీగా ఎయిర్‌టెల్‌

భారత్‌లో అతిపెద్ద మొబైల్‌ టవర్‌ కంపెనీగా ఎయిర్‌టెల్‌

దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ తన టవర్‌ యూనిట్‌ను ఇండస్‌ టవర్స్‌ లిమిటెడ్‌తో విలీనం చేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ డీల్‌ విలువ 10.8 బిలియన్‌ డాలర్లు(రూ.71,500 కోట్లు). ఈ ఒప్పందంలో ప్రతి ఇండస్ టవర్ వాటాకి 1,565 షేర్లను చెల్లించేందుకు అంగీకరించినట్టు భారతి ఎయిర్‌టెల్‌ రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది. తాజా డీల్‌తో చైనా వెలుపల భారత్‌లో అతిపెద్ద మొబైల్‌ టవర్‌ కంపెనీగా ఎయిర్‌టెల్‌ ఆవిర్భవిస్తుంది. విలీనం తరువాత ఉమ్మడి సంస్థ ఇండస్‌ టవర్స్‌ లిమిటెడ్‌గా కొనసాగనుంది.  
తెదేపా నేత ఆనం వివేకానందరెడ్డి అస్తమయం

తెదేపా నేత ఆనం వివేకానందరెడ్డి అస్తమయం

తెలుగుదేశం పార్టీ నేత, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి(67) బుధవారం కన్నుమూసారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1950 డిసెంబర్‌ 25న నెల్లూరులో జన్మించిన ఆయన వీఆర్‌ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసారు. మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. రేపు నెల్లూరులో వివేకానందరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత ఆనం వివేకానంద రెడ్డి మృతి

మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత ఆనం వివేకానంద రెడ్డి మృతి

మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత ఆనం వివేకానంద రెడ్డి (67) బుధవారం నాడు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నెల రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.1950 డిసెంబర్ 25వ తేదిన ఆనం వివేకానంద రెడ్డి జన్మించారు. ఆనం వివేకానందరెడ్డికి ఇద్దరు కొడుకులు. మూడు దఫాలు ఆనం వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు.1999 నుండి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఏప్రిల్ 26వ తేదిన నెల్లూరులో ఆనం వివేకానందరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.