Short News

జులై 14 నుండి ఆగస్టు11 వరకు ఆషాఢ మాస విశేషాలు

జులై 14 నుండి ఆగస్టు11 వరకు ఆషాఢ మాస విశేషాలు

ఆషాఢ మాసంలో విశేషాలు ప్రాముఖ్యతగురించి తెలుసుకుందాం జులై 14 నుండి ఆగస్టు11 వ తేదీ వరకు పూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాఢ మాసంగా చెప్పబడింది.ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని అంటారు. శూన్యమాసం అంటే శుభకార్యాలకు అనుకూలం కాని మాసం అని అర్ధం. వర్ష ఋతువు కూడా ఈ మాసం లోనే ప్రారంభమవుతుంది.ఈ నెలలో చేసే స్నానం,దానం, జప,పారాయణలకు మొదలగు పనులకు విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుంది. ఆషాఢ మాసంలో చేసే సముద్ర, నదీ స్నానాలు ఎంతో ముక్తి దాయకాలు.

గీతగోవిందం టీజర్ రేపటికి వాయిదా.. దిల్ వల్లే అంటూ వెరైటీగా పోస్ట‌ర్‌లో!

గీతగోవిందం టీజర్ రేపటికి వాయిదా.. దిల్ వల్లే అంటూ వెరైటీగా పోస్ట‌ర్‌లో!

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించే సినిమాలపై యువతలో ఆసక్తి పెరుగుతోంది. అర్జున్ రెడ్డి చిత్రం తరువాత విజయ్ దేవరకొండ క్రేజీ హీరోగా మారిపోయాడు. విజయ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం గీతగోవిందం. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర టీజర్ నేడు విడుదల కావలసి ఉంది. కానీ రేపటికి వాయిదా పడింది. హీరో నితిన్ నటిస్తున్న శ్రీనివాస కళ్యాణం చిత్ర టీజర్ కూడా నేడు విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు గీత గోవిందం చిత్ర యూనిట్ కి ఫోన్ చేసి టీజర్ విడుదల రేపటికి వాయిదా వేసుకోవాలని రిక్వస్ట్ చేశారట.

అట్లకాడతో గుండెలో...మద్యం ఎంత పని చేసింది!

అట్లకాడతో గుండెలో...మద్యం ఎంత పని చేసింది!

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో హత్యా ఘటనలను పరిశీలిస్తే వాటిలో మద్యం ప్రమేయం ఉన్న వాటి సంఖ్యే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పలు సంఘటనల్లో హత్యకు గురైన వాళ్లని మద్యం తాగుదాం రమ్మని తీసుకెళ్లి హతమార్చిన ఉదంతాలే అత్యధికంగా ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో మరో హత్య చేరింది. పోలీసుల కథనం ప్రకారం...గుంటూరు-నర్సరావుపేట రహదారిలో కనపర్రు గ్రామానికి చెందిన కుంచాల జోజయ్య(40) అక్క భర్త అయిన వల్లెపు శ్రీనును మద్యం తాగేందుకు అతడి స్నేహితుడు పిలిచాడు.

బిగ్ బాస్ షోకు మరో షాక్ : తేజస్వి మదివాడ ఎలిమినేషన్ ముందే లీక్!

బిగ్ బాస్ షోకు మరో షాక్ : తేజస్వి మదివాడ ఎలిమినేషన్ ముందే లీక్!

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆదివారం రాత్రి ప్రసారం అయ్యే షో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ విషయాలు సోషల్ మీడియా ద్వారా ముందే లీక్ అవుతుండటంతో షో నిర్వాహకులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇంతకు ముందు యాంకర్ శ్యామల విషయంలో ఇలానే జరిగిన విషయం తెలిసిందే. తాజాగా తేజస్వి మదివాడ ఎలిమినేట్ అయిన విషయం లీకైంది.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more