Short News

11 మంది సజీవదహనం, లేడీ టీచర్లు ఏం చేశారో చూడండి!

11 మంది సజీవదహనం, లేడీ టీచర్లు ఏం చేశారో చూడండి!

తమిళనాడులోని తేని జిల్లా కురంగణి అటవి ప్రాంతంలో ఆకస్మికంగా మంటలు వ్యాపించి 11 మంది సజీవదనహం అయ్యారు. బాధితులను రక్షించడానికి వైమానికదళ రెస్కూ హెలికాప్టర్లు అక్కడికి వెళ్లాయి. తేని జిల్లాలోని కురంగణి అటవి ప్రాంతం సమీపంలో ట్రైనింగ్ తీసుకుంటున్న లేడీ టీచర్లు రక్షణ శాఖకు చెందిన రెస్కూ హెలికాప్టర్ల దగ్గరకు చేరుకున్నారు. ఒక పక్క సహాయక చర్యలు కొనసాగుతుంటే బాధితులపై జాలి చూపించకుండా చిక్కింది ఇదే చాన్స్ అంటూ లేడీ టీచర్లు సెల్ఫీలు తీసుకున్నారు.

"అది ఫ్లాప్ హీరో కట్టుకథ, పవన్ సభకు జనం తరలింపు"

"అది ఫ్లాప్ హీరో కట్టుకథ, పవన్ సభకు జనం తరలింపు"

అపరేషన్ గరుడ, ద్రవిడ అంతా అబద్ధమని, అదంతా ఓ ఫ్లాప్ హీరో ఊహాజనిత కథలని బిజెపి అదికార ప్రతినిధి సుధీష్ రాంభొట్ల హీరో శివాజీ ఆరోపణలను కొట్టి పారేశారు. కారెం శివాజీ లాగా ఈ శివాజీ కూడా ఏదో పదవి వచ్చే వరకు ఇలాగే చేస్తుంటారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ బిడ్డే అయితే సీమలో ఎందుకు అభివృద్ధి జరగలేదని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు. బిజెపిని తిడతారని అనుకుని పవన్ కల్యాణ్ సభకు టిడిపి నేతల జనాన్ని తరించారని, అయితే అక్కడ సీన్ రివర్స్ అయిందని అన్నారు.

అవును.. వ్యక్తిగత సమాచారం ఫేస్‌బుక్‌ అమ్మేసుకుంది

అవును.. వ్యక్తిగత సమాచారం ఫేస్‌బుక్‌ అమ్మేసుకుంది

ఫేస్‌బుక్‌ సమాచార భద్రత విషయంలో మరో బాంబు పేలింది. ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని అమ్మకానికి పెడుతుందని వైట్‌హౌజ్‌ మాజీ అధికారి స్టీవ్‌ బన్నొన్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌ తన ఖాతాదారులా డేటాను అమ్మేసుకుందన్నారు. అయితే రాజకీయ సంబంధిత డేటా చోరీ అంశంపై మాత్రం తనకు స్పష్టత లేదని.. కాబట్టి ఆ అంశంపై స్పందించబోనని బన్నొన్‌ తెలిపారు. గురువారం ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన పలు విషయాలను ప్రస్తావించారు.
చైనాపై కత్తి దూసిన అమెరికా, కౌంటర్‌తో డ్రాగన్ అటాక్

చైనాపై కత్తి దూసిన అమెరికా, కౌంటర్‌తో డ్రాగన్ అటాక్

చైనా అమెరికాల మధ్య ట్రేడ్ వార్ వేడెక్కింది. చైనాకు అమెరికా దిమ్మతిరిగే ట్రీట్ మెంట్ ఇచ్చిన నేపథ్యంలో వెంటనే తేరుకున్న చైనా అదే స్థాయిలో అమెరికాపై చైనా కౌంటర్ వేసింది. ప్రపంచ దేశాల నుంచి మేధో సంపత్తిని తస్కరించి సొమ్ము చేసుకుంటున్న చైనాను శిక్షించి తీరుతామని పదేపదే హెచ్చరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు డ్రాగన్‌కు షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.ఇందులో భాగంగా సాలీనా 60 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.90 లక్షల కోట్ల) సుంకాల ప్యాకేజీతో చైనాను చావుదెబ్బ కొట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.