Short News

కర్నాటకలో సిద్ధూకు చెక్ చెప్పేందుకు రంగంలోకి ఆరెస్సెస్

కర్నాటకలో సిద్ధూకు చెక్ చెప్పేందుకు రంగంలోకి ఆరెస్సెస్

కర్నాటక ఎన్నికల్లో హిందూమతంలో చిచ్చు పెట్టి, ఇతర మార్గాలతో కాంగ్రెస్ పార్టీ గెలుపొందాలని భావిస్తోందని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టేందుకు బీజేపీ తరఫున రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ (ఆరెస్సెస్) కార్యకర్తలు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. గుజరాత్‌లో బీజేపీ గెలుపు కోసం ఆరెస్సెస్ పని చేసింది. ఇతర రాష్ట్రాల్లోను పని చేసింది. ఇప్పుడు కర్నాటకలోను ఆరెస్సెస్ రంగంలోకి దిగింది. ఇప్పటికే 20 వేల మంది స్వయంసేవకులు బీజేపీ గెలుపు కోసం పని చేస్తున్నారు. మరో 30 వేల మంది త్వరలో రంగంలోకి దిగనున్నారు.

జగన్ ఆ దమ్ముందా? పవన్ నిరూపించు:మంత్రి లోకేష్ ఫైర్

జగన్ ఆ దమ్ముందా? పవన్ నిరూపించు:మంత్రి లోకేష్ ఫైర్

శ్రీకాకుళం:ప్రతిపక్ష నేత జగన్, జగనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఐటి శాఖా మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ కు ప్రధాని మోడీని విమర్శించే దమ్ముందా? ...అని ప్రశ్నించారు. ఒక్కటంటే ఒక్కమాట కూడా ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం జగన్ చేయలేడని లోకేష్ ఎద్దేవా చేశారు.మరోవైపు జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పై లోకేష్ ఆచి తూచి స్పందించారు. పవన్‌కల్యాణ్ చేసిన విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.

ఏప్రిల్ 26న హైదరాబాద్ లో పెట్రోలు, డీజిల్ ధరలు

ఏప్రిల్ 26న హైదరాబాద్ లో పెట్రోలు, డీజిల్ ధరలు

పెట్రోల్‌ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. హైదరాబాద్ లో పెట్రోల్‌, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.లీటరు పెట్రోల్‌ ధర 79.04కు చేరగా డీజిల్‌ ధర రూ.71.63 వద్ద ఉంది. బుధవారంతో పోలిస్తే గురువారం ఎలాంటి మార్పులేదు. అయితే ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలన్నీ గతేడాది జూన్‌ నుంచి రోజు వారీగా పెట్రోలు ధరల సవరిస్తూ వస్తున్నాయి. ధరలు పెరిగేది పైసల్లో అయినా.. సామాన్యుడికి మాత్రం పెను భారంగా మారింది.
‘భూమా’తో సంబంధాలు తెగిపోయాయి: ఏవీ సుబ్బారెడ్డి

‘భూమా’తో సంబంధాలు తెగిపోయాయి: ఏవీ సుబ్బారెడ్డి

ఏపీ మంత్రి భూమా అఖిలప్రియపై టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తనపై ఎప్పుడైతే రాళ్లదాడి జరిపారో అప్పుడే భూమా కుటుంబంతో తనకున్న సంబంధాలు తెగిపోయాయని దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆళ్లగడ్డలో సైకిల్‌ ర్యాలీ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. తనపై మంత్రి అఖిలప్రియే రాళ్ల దాడి చేయించారంటూ ఏవీ సుబ్బారెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.