Short News

బుల్లితెర నటి కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?

బుల్లితెర నటి కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?

సాధారణ ప్రజలతో పోలిస్తే.. సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారన్న విషయం అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో భాగంగానే ప్రముఖ కన్నడ బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ జీటీ ప్లస్ కారును కొనుగోలు చేశారు.నటి 'ప్రజ్ఞా భట్'(Prajna Bhat) కొనుగోలు చేసిన 'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ జీటీ ప్లస్' కారుకు సంబంధించిన ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ఇందులో ఆమె, ఆమె భర్త నాగశ్రీత్ భట్ ఇద్దరూ కలిసి కారును డెలివరీ తీసుకోవడం చూడవచ్చు. నెట్టింట్లో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కొత్త కారు కొన్న నటికి నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పటికే వేలసంఖ్యలో ఈ ఫోటోలు లైక్స్ పొందాయి.
జనరల్‌ టికెట్‌ ప్యాసింజర్స్‌తో ఫుల్‌ రష్‌గా రిజర్వ్‌డ్‌ కోచ్‌లు

జనరల్‌ టికెట్‌ ప్యాసింజర్స్‌తో ఫుల్‌ రష్‌గా రిజర్వ్‌డ్‌ కోచ్‌లు

దేశంలోని రైళ్లలో జనరల్‌ టికెట్‌ ప్రయాణికులు.. ఇటీవల రిజర్వ్‌డ్‌ కోచ్‌(Train Reserved Coaches)ల్లో ప్రయాణిస్తున్న సంఘటనలు చాలా చోటుచేసుకున్నాయి. ఈ కారణంగా టికెట్‌ రిజర్వ్‌ చేసుకున్న ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. జనరల్‌ బోగీల్లో రద్దీని తలపించేలా ఏసీ, స్లీపర్‌ కోచ్‌లు ఉంటున్నాయి. ఈ క్రమంలో దీనిపై ఓ ప్రయాణికుడు రైల్వేకు ఫిర్యాదు చేశారు.
ఫ్రీ బస్సులో బామ్మ, మనవరాలికి షాక్‌ ఇచ్చిన బస్‌ కండక్టర్‌.. లవ్‌బర్డ్స్‌కి టికెట్‌ వేసి ఝలక్‌

ఫ్రీ బస్సులో బామ్మ, మనవరాలికి షాక్‌ ఇచ్చిన బస్‌ కండక్టర్‌.. లవ్‌బర్డ్స్‌కి టికెట్‌ వేసి ఝలక్‌

ప్రభుత్వ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ టిక్కెట్లు ఇచ్చినా(Free Ticket For Women).. వారు తీసుకెళ్తున్న లగేజీకి మాత్రం ఏకంగా రూ. 444 టికెట్ ఛార్జీలు వసూలు చేశారు కండక్టర్. ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఇంతకీ వారు తీసుకెళ్తున్న లగేజీ ఏంటీ.?? ఆ లగేజీకి అంత ఛార్జీ వసూలు చేయడమేంటి.?? పూర్తి సమాచారం ఈ కథనంలో..
Hero Pleasure Plus Xtec Sports గురించి ఈ విషయాలు తెలుసా..

Hero Pleasure Plus Xtec Sports గురించి ఈ విషయాలు తెలుసా..

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్'(Hero MotoCorp) ఎట్టకేలకు మరో స్కూటర్ లాంచ్ చేసింది. ఈ స్కూటర్ డిజైన్ ఎలా ఉంది, ఫీచర్స్ ఏంటి? ఇంజిన్ వివరాలు వంటివి ఈ కథనంలో చూసేద్దాం..హీరో మోటోకార్ప్ లాంచ్ చేసిన కొత్త స్కూటర్ 'ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్‌' (Hero Pleasure Plus Xtec). ఈ స్కూటర్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఫీచర్స్ కూడా దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా ఉత్తమంగా ఉంటాయి. కొత్త కలర్ స్కీమ్ పొందిన ఈ ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్‌ స్కూటర్ ధర కూడా తక్కువగానే ఉంటుంది.