Short News

వాలెంటైన్స్ డే: ప్రపంచమంతా ప్రేమే! ఒక్కోచోట ఒక్కోలా.. కానీ అక్కడ మాత్రం..

వాలెంటైన్స్ డే: ప్రపంచమంతా ప్రేమే! ఒక్కోచోట ఒక్కోలా.. కానీ అక్కడ మాత్రం..

ఏటా ఫిబ్రవరి 14ను 'ప్రేమికుల దినోత్సవం(వాలెంటైన్స్ డే)గా జరుపుకుంటారని అందరికీ తెలిసిందే. కొత్తగా ప్రేమలో పడిన యువతీ యువకులు.. ఎప్పుడెప్పుడు తమ ప్రేమను తమ ప్రియుడు లేదా ప్రియురాలికి వ్యక్తం చేద్దామా అని ఈ రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక మన దేశంలో అయితే భజరంగ్ దళ్ కార్యకర్తలు ఫిబ్రవరి 14న చేసే హడావుడి అంతా ఇంతాకాదు. ఆ రోజున ఎక్కడ, ఏ పార్కులో ప్రేమికులు జంటగా కనిపించినా అక్కడికక్కడే బలవంతంగా తాళి కట్టించేందుకు ప్రయత్నిస్తుంటారు.

నేడే టీఆర్ఎస్ ప్లీనరీ: ఫెడరల్ ఫ్రంట్‌పై కేసీఆర్ ఏం చెబుతారో

నేడే టీఆర్ఎస్ ప్లీనరీ: ఫెడరల్ ఫ్రంట్‌పై కేసీఆర్ ఏం చెబుతారో

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) 17వ ప్లీనరీ సమావేశాలకు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 10గంటలకు(ఏప్రిల్ 27న) హైదరాబాద్ శివారు కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్‌లో ఈ ప్లీనరీ ప్రారంభం కానుంది. ప్లీనరీ ప్రాంతానికి ప్రగతి ప్రాంగణంగా నామకరణంచేశారు. కేసీఆర్ తన ఫెడరల్ ఫ్రంట్‌పై ఈ ప్లీనరీ వేదికగా ఏదైనా కీలక ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏం చెబుతారోనని రాజకీయంగా ఆసక్తి ఏర్పడింది.

త్వరలో 'భరత్‌ అనే నేను'లో మరిన్ని సీన్లు

త్వరలో 'భరత్‌ అనే నేను'లో మరిన్ని సీన్లు

మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన చిత్రం 'భరత్ అనే నేను'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళతో అదరగొడుతోంది. ఈ సినిమా విడుదలకి ముందు నిడివి కారణంగా కొన్ని సీన్లను తోలిగించినట్లు చిత్రబృందం పలు ఈవెంట్లలో చెప్పింది. తాజాగా ఫైనల్ ఎడిటింగ్ సమయంలో తొలగించిన సన్నివేశాలను తిరిగి కలపబోతున్నట్టు దర్శకుడు కొరటాల శివ తెలిపాడు. త్వరలో కలపబోయే సీన్లకు ఇప్పటికే డబ్బింగ్ చెప్పించడం ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.  
ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

చిత్తూరు జిల్లాలోని పీలేరు మండలం తానా వడ్డిపల్లిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలో జరుగుతున్న నల్లగంగమ్మ జాతరకు వచ్చి తిరిగివెళ్తున్న డప్పు కళాకారులపైకి సిమెంటు లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు కళాకారులు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. మృతులను నారాయణ(43), జయరాం(44), బీరప్ప(72), వెంకటరావు(42), లక్ష్మణ్‌(68)గా గుర్తించారు. వీరంతా నిమ్మనిపల్లి మండలం కొండసానిపల్లికి చెందిన వారు.