Short News

'రజనీ-కమల్‌ల కంటే ముందే రాజకీయాల్లోకి రావాలనుకున్నా'

'రజనీ-కమల్‌ల కంటే ముందే రాజకీయాల్లోకి రావాలనుకున్నా'

సినీ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్‌ల కంటే ముందే తన తనయుడు హీరో విజయ్ రాజకీయాల్లోకి రావాలని భావించారని ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం నటులంతా రాజకీయాల వైపు వస్తున్నారని, అందుకే విజయ్ ప్రస్తుతం రావటం లేదని అభిప్రాయపడ్డారు. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ రాజకీయాల్లోకి వచ్చారని, ఇప్పుడు విజయ్‌ కూడా వస్తే సినిమా నటులు అందరూ రాజకీయాల వైపు ఎందుకు వస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తారని ఆయన అన్నారు. కానీ రజనీ, కమల్‌ల కంటే ముందే విజయ్‌ రాజకీయాల్లోకి రావాలనుకున్నాన్నారు.

రిలయన్స్ జియోలో కొత్తగా 80 వేల ఉద్యోగాలు

రిలయన్స్ జియోలో కొత్తగా 80 వేల ఉద్యోగాలు

దేశీయ టెలికం మార్కెట్‌లో రిలయన్స్ జియో పెను సంచలనం సృష్టించింది. 2018-19లో 80 వేల మంది కొత్త ఉద్యోగులను చేర్చుకోవాలని భావిస్తోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ఛీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సంజయ్ జోగ్ వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం జియోలో సుమారు 1.57 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, కొత్తగా మరో 75 వేల నుంచి 80 వేల మందిని చేర్చుకోవాలని భావిస్తున్నట్లుగా వెల్లడించారు.
మీ ఆరోగ్యానికి ఈ కృత్రిమమైన స్వీటెనర్లు చాలా డేంజర్ !

మీ ఆరోగ్యానికి ఈ కృత్రిమమైన స్వీటెనర్లు చాలా డేంజర్ !

మీరు డైట్ సోడాను ఇష్టపడే వారైతే, ఇది మీకు చెడు వార్త కావచ్చు. కృత్రిమ స్వీటెనర్లతో తయారుచేసిన తక్కువ కేలరీలు గల పానీయాలు & స్నాక్స్ మీకు మధుమేహం, ఊబకాయం వంటి అనారోగ్యాలను కలుగజేసే అవకాశం ఉందని ఒక కొత్త అధ్యాయనంలో నిర్ధారించబడింది. వాటితో పాటు గుండె జబ్బుల వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కావచ్చు. ఈ వ్యాసం ద్వారా మనము కృత్రిమ స్వీటెనర్ల వల్ల కలిగే ప్రమాదాల గూర్చి పూర్తిగా తెలుసుకోబోతున్నాం.

కృత్రిమ స్వీటెనర్ల వల్ల కలిగే ప్రమాదాలను నమోదు చేశారు.

అమ్మ అంటే ఏంటో 'కణం'తో తెలుసుకున్నాను

అమ్మ అంటే ఏంటో 'కణం'తో తెలుసుకున్నాను

నటి సాయిపల్లవి 'కణం' సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. నాగశౌర్య, సాయిపల్లవి నటించిన ఈ చిత్రానికి ఎ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా శుక్రవారం రిలీజ్‌ అవుతున్న సందర్భంగా సాయిపల్లవి మీడియాతో మాట్లాడింది. 'ఈ సినిమాలో అమ్మ పాత్ర పోషించాను. అమ్మ పాత్రలో షేడ్స్‌ అన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఈ సినిమా ద్వారా చాలా పరిణితి చెందానని అనుకుంటున్నాను. సినిమాలో నా పాత్ర నిడివి కంటే ఎంత ఇంపార్టెన్స్‌ అన్నది ముఖ్యంగా ఆలోచిస్తాను. సినిమా నుంచి నేను కోరుకునేది కేవలం ఆనందమే' అని చెప్పింది.