Short News

క‌థువా చిన్నారి పై చ‌చ్చాక కూడా క‌నిక‌రం చూప‌లేదు

క‌థువా చిన్నారి పై చ‌చ్చాక కూడా క‌నిక‌రం చూప‌లేదు

కథువా అత్యాచార బాధితురాలి అంత్య క్రియ‌ల విష‌యంలో స్థానిక గ్రామ‌స్థులు దారుణంగా ప్రవర్తించారు. చిన్నారి మృతదేహం ఖననం చేయడానికి స్థలం కూడా ఇవ్వలేద‌ని బాధితురాలి బంధువులు తెలిపారు. దీంతో 8 కిలో మీట‌ర్ల‌ దూరంలోని మరో గ్రామంలో చిన్నారి అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని వెల్ల‌డించారు. చిన్నారి బంధువుల‌ను ఖ‌న‌నం చేసిన చోటే పాప మృత దేహానికి శ‌వ సంస్కారాలు చేయాల‌ని ఆమె తండ్రి భావించాడు. కానీ ఆ స్థ‌లం బక్రావల్‌ తెగకు చెందిన ఆ కుటుంబానిది కాదని వాదిస్తూ గ్రామ‌స్థులు గొయ్యి తవ్వకుండా అడ్డుకున్నారు. 
ప్రత్యేక హోదా అంశంపై స్పందించిన చిరంజీవి

ప్రత్యేక హోదా అంశంపై స్పందించిన చిరంజీవి

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి స్పందించారు. స్పెషల్ స్టేటస్ ను ఎప్పటికైన ఇచ్చేది కాంగ్రెస్‌ పార్టీనే అని అన్నారు. 2019లో రాహుల్‌ గాంధీ ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి అని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పడూ మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు.అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి సహా ఒడిశా రాష్ట్ర కాంగ‍్రెస్‌ ఇంచార్జ్‌గా నియమితులైన గిడుగు రుద్రరాజు.. శనివారం చిరంజీవిని హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా చిరు ఈ వ్యాఖ్యలు చేశారు.
గతంలోను అత్యాచారాలు జరిగాయి, కానీ: హేమమాలిని

గతంలోను అత్యాచారాలు జరిగాయి, కానీ: హేమమాలిని

హిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాల అంశంపై బీజేపీ ఎంపీ హేమమాలిని స్పందించారు. పెరిగిన మీడియా, సోషల్ మీడియా, ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం కారణంగా చిన్నారులు, మహిళలపై జరుతున్న దాడులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయన్నారు. గతంలోను ఇలాంటివి చోటు చేసుకున్నాయన్నారు.ఈ ఘటనలపై ప్రజలలో చైతన్యం పెరిగిందని, గతంలో కూడా ఇలాంటివి అనేకం జరిగాయని, కానీ వాటి గురించి ఎవరికి తెలియదని, వీటిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, వాటికి పరిష్కారం చూపిస్తుందని, ఇలాంటి దుర్ఘటనలు అసలు జరగకూడదని, వాటి వల్ల దేశానికి చెడ్డ పేరు వస్తోందన్నారు.

‘డాక్టర్‌ స్ట్రేంజ్‌’ ‌లో సచిన్  నటిస్తే బాగుంటుంది

‘డాక్టర్‌ స్ట్రేంజ్‌’ ‌లో సచిన్ నటిస్తే బాగుంటుంది

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెండూల్కర్‌ తన బయోపిక్‌ ‘సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌' చిత్రంతో నటుడిగా మారారు. అయితే ఈ సినిమాలో సచిన్‌ నటన ప్రముఖ హాలీవుడ్‌ నటుడు బెనెడిక్ట్‌ కంబర్‌ బ్యాచ్‌కి కూడా తెగ నచ్చేసినట్టుంది. సచిన్‌ అమెరికన్‌ సూపర్‌హీరో సిరీస్ ‘డాక్టర్‌ స్ట్రేంజ్‌' ‌లో నటిస్తే బాగుంటుందని బెనెడిక్ట్‌ అభిప్రాయపడుతున్నారు. ఈ సిరీస్‌లో బెనెడిక్ట్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బెనెడిక్ట్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్' చిత్రం భారత్‌లో ఏప్రిల్‌ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.