Short News

అవసరమైన డాక్యుమెంట్లు ఇచ్చాం, ప్రభుత్వం మాదే: కుమారస్వామి

అవసరమైన డాక్యుమెంట్లు ఇచ్చాం, ప్రభుత్వం మాదే: కుమారస్వామి

రాజ్ భవన్ వద్ద కాసేపు హైడ్రామా అనంతరం జేడీఎస్ - కాంగ్రెస్ ముఖ్య నేతలకు గవర్నర్ అపాయింటుమెంట్ లభించింది. జేడీఎస్ అధినేత కుమార స్వామి, కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షులుపరమేశ్వర, శివకుమార్, ఎన్ఆర్ పాటిల్, వీరప్ప మొయిలీలు గవర్నర్‌ను కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తమకు ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన బలం ఉందని చెప్పారు. తమకు గవర్నర్ అవకాశమివ్వాలని చెప్పారు. తమ ఎమ్మెల్యేలకు డబ్బులు, పదవులు ఎర వేస్తున్నారని ఆరోపించారు.

ఎన్టీఆర్‌ని నలిపేస్తున్న రాంచరణ్.. అద్భుతమైన రీతిలో బర్త్ డే విషెష్!

ఎన్టీఆర్‌ని నలిపేస్తున్న రాంచరణ్.. అద్భుతమైన రీతిలో బర్త్ డే విషెష్!

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఎన్టీఆర్ మధ్య బంధం బలపడుతోంది. ఇటీవల కాలంలో అభిమానులు కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారు. ఎన్టీఆర్, రాంచరణ్ తరచుగా కలుసుకుంటున్నారు. ఒకరి సినిమాల విషయంలో మరొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుక. అభిమానులు భారీస్థాయిలో ఎన్టీఆర్ పుట్టినరోజుని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎన్టీఆర్ కు వెల్లువలా వస్తున్నాయి.

హానర్ 7ఎ విడుదల ఎప్పుడంటే..

హానర్ 7ఎ విడుదల ఎప్పుడంటే..

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 7ఎను ఈ నెల 22వ తేదీన విడుదల చేయనుంది. ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి. 5.7 ఇంచ్ లు గల భారీ డిస్‌ప్లే ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు.
కస్టమ్స్‌ బ్రోకరేజ్‌ లైసెన్స్‌ వారికి ఆధార్‌, పాన్‌ కార్డు తప్పనిసరి

కస్టమ్స్‌ బ్రోకరేజ్‌ లైసెన్స్‌ వారికి ఆధార్‌, పాన్‌ కార్డు తప్పనిసరి

కస్టమ్స్‌ బ్రోకరేజ్‌ లైసెన్స్‌ కావాలనుకునేవారు ఆధార్‌, పాన్‌ను తప్పనిసరిగా సమర్పించాలని, కేంద్ర ఎక్సైజ్‌, కస్టమ్స్‌ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. వ్యాపార సంబంధించిన ఎగుమతులు, దిగుమతులు చేయటం, ఆడిట్‌ నిర్వహించడం తదితర కార్యకలాపాలను అధికారికంగా నిర్వహించాలంటే కస్టమ్స్‌ బ్రోకరేజ్‌ లైసెన్స్‌ కావాల్సి ఉంటుంది. ఈ మేరకు అందుకు అనుమతులు పొందాలంటే కస్టమ్స్‌ బ్రోకర్స్‌ లైసెన్స్‌ రెగ్యులేషన్స్‌ 2018 ప్రకారం సదరు వ్యక్తి తన ఆధార్‌, పాన్‌లను సమర్పించాల్సి ఉంటుంది.