Short News

పశ్చిమబెంగాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

పశ్చిమబెంగాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కూచ్ బెహర్, అలీపూర్దుర్, నార్త్ దినాజ్పూర్, సౌత్ దినాజ్పూర్, జల్పైగురి , మాల్డా తదితర ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఓట్ల లెక్కింపు ఆలస్యమైనప్పటికీ... మళ్లీ పునరుద్ధరించారు. ఎన్నడూ లేని విధంగా పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ సారి తీవ్ర హింస చెలరేగిన సంగతి తెలిసిందే.
సీనియ‌ర్ న‌టుడు హేము అధికారి క‌న్నుమూత‌

సీనియ‌ర్ న‌టుడు హేము అధికారి క‌న్నుమూత‌

ప్రముఖ నటుడు హేము అధికారి (81)కన్నుమూశారు. ఊపరితిత్తుల సంబంధిత సమస్యతో బాధ పడుతున్న హేము అధికారి నిన్న దాదర్‌లోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. రాజ్‌కుమార్ హిరానీ-సంజయ్‌దత్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ మూవీ లగే రహో మున్నాభాయ్‌లో కీలక పాత్ర పోషించారు హేము అధికారి. ఆయన ధ్యాస్ పర్యా, హరీశ చంద్రాచి ఫ్యాక్టరీ వంటి మరాఠీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హేము అధికారికి భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. హేము అధికారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
వై వి యస్ చౌదరి కొత్త సినిమా వివరాలు.. ఈసారి తన స్టైల్  మార్చారు!

వై వి యస్ చౌదరి కొత్త సినిమా వివరాలు.. ఈసారి తన స్టైల్ మార్చారు!

యలమంచిలి వేంకట సత్యనారాయణ చౌదరి స్క్రీన్ నేమ్ వై వి యస్ చౌదరి, మే 23 న పుట్టిన రోజు సందర్భంగా అతని కెరీర్ సింహావలోకనం చేసుకుంటే... విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామరావు వీర అభిమాని అయినా అతను ఆ మహానటుడి తేజోరూపం పట్ల ఆకర్షితుడై తెలుగు సినీ రంగం లోకి ప్రవేశించడం జరిగింది.ఓ గొప్ప దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రైటర్ గా, నిర్మాతగా, పంపిణీదారుడిగా మరియు ప్రదర్శన దారుడిగా ఈనాడు టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని నిలపెట్టుకున్నాడు వై వి యస్ చౌదరి.

కర్ణాటక కాంగ్రెస్ లో అప్పుడే రచ్చ రచ్చ: డీసీఎం కోసం పోటాపోటీ

కర్ణాటక కాంగ్రెస్ లో అప్పుడే రచ్చ రచ్చ: డీసీఎం కోసం పోటాపోటీ

కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో పోటీ తారాస్థాయికి చేరడంతో రచ్చరచ్చ అవుతోంది. అడగడంలో తప్పేముంది అంటున్నారు మాజీ మంత్రి రోషన్ బేగ్. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో నలుగురు పోటీ పడుతున్నారని వెలుగు చూసింది. దళితుడైన కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి. పరమేశ్వర్, వీరశైవ మహాసభ అధ్యక్షుడు శామనూరు శివశంకరప్ప, డీకే శివకుమార్, మైనారిటీల నాయకుడు రోషన్ బేగ్ ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు.