Short News

రేపు ఉ.9.30 ని.లకు సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం.?

రేపు ఉ.9.30 ని.లకు సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం.?

మే17న ఉదయం 9.30కు కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణం స్వీకారం చేస్తారని బీజేపీ ఎమ్మెల్యే సురేష్ కుమార్ సోషల్ మీడియలో పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ విజుభాయ్ న్యాయ నిపుణులతో చర్చించారు. అతి పెద్ద పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వడం తప్ప మరో దారిలేదని న్యాయ నిపుణులు గవర్నర్ కు సూచించారు. దీంతో యడ్యూరప్పనే సీఎంగా గురువారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది.
నిన్నటి తరం అభిమానుల వద్దకు వెళ్ళనున్న 'మహానటి'

నిన్నటి తరం అభిమానుల వద్దకు వెళ్ళనున్న 'మహానటి'

అలనాటి మేటి నటి సావిత్రి జీవిత నేప‌థ్యంతో తెర‌కెక్కిన చిత్రం 'మ‌హాన‌టి'. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డ‌మే కాక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ళు సాధిస్తోంది. సావిత్రిగా కీర్తి సురేష్ కెరీర్ బెస్ట్ పాత్రను పోషించి మెప్పించింది. చిత్ర నిర్మాణ సంస్థ జూన్ మూడో వారం నుండి 'మ‌హాన‌టి' చిత్రాన్ని ఓల్డేజ్ హోమ్‌లలో ప్రదర్శించనున్నారు. 'మహానటి మీ ద‌గ్గ‌రికే వ‌స్తుంది. త‌న త‌రం వారి ద‌గ్గ‌ర‌కి త‌ర‌లి వ‌స్తుంది' అని పోస్ట‌ర్ ద్వారా తెలిపారు.
కోరలు చాస్తున్న 'నిపా' ..కేరళలో హై-ఎలర్ట్

కోరలు చాస్తున్న 'నిపా' ..కేరళలో హై-ఎలర్ట్

కేరళలో మొదలైన 'నిపా' కలవరంతో దేశమంతా ఉలిక్కిపడింది. ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా విస్తరించే ఈ వైరస్‌ సోకితే మరణావకాశాలు చాలా ఎక్కువ. నిపా వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. నిపా వైరస్‌ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అధికార యంత్రాంగం సరిహద్దుల్లో ముందు జాగ్రత్తలకు సిద్ధం అయింది. కేరళ సరిహద్దుల్లోని కన్యాకుమారి, తిరునల్వేలి, తేని, కోయంబత్తూరు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతానికి ఈ వైరస్ కేరళ వరకు మాత్రమే పరిమితమై ఉంది.  
ఉత్తమ యూనివర్సిటీల్లో హెచ్‌సీయూకు 4వ స్థానం

ఉత్తమ యూనివర్సిటీల్లో హెచ్‌సీయూకు 4వ స్థానం

వీక్‌ మ్యాగజైన్‌-హన్సా రీసెర్చ్‌ ఇటీవల ఉత్తమ యూనివర్సిటీలకు సంబంధించి సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ నాలుగో స్థానం దక్కించుకుంది. దేశవ్యాప్తంగా సాగిన ఈ సర్వేలో జేఎన్‌యు, యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ, బనారస్‌ హిందూ యూనివర్సిటీలు మొదటి మూడు స్థానాలు దక్కించుకోగా హెచ్‌సీయూ నాలుగో స్థానంలో నిలిచింది. దక్షిణ భారతదేశ పరంగా హెచ్‌సీయు మొదటి స్థానంలో నిలిచింది. 2017లో వీక్‌ మ్యాగజైన్‌ సర్వేలో కూడా హెచ్‌సీయూ నాలుగో స్థానంలో నిలిచింది.