Short News

రుణ మాఫీపై  24 గంటల్లో నివేదిక ఇవ్వాలని యడ్యూరప్ప ఆదేశం

రుణ మాఫీపై 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని యడ్యూరప్ప ఆదేశం

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీని అమలు చేసే దిశగా కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప నడుం బిగించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత రూ.56వేల కోట్ల విలువైన రైతుల రుణాలను మాఫీ చేసే దిశగా యడ్యూరప్ప ప్రయత్నాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత యడ్యూరప్ప రెవిన్యూ సెక్రటరీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రూ.లక్షలోపు రైతుల రుణాలను మాఫీ చేసేందుకు అవకాశాలను అన్వేషించాలని యడ్యూరప్ప రెవిన్యూ సెక్రటరీని ఆదేశించారు.

వైరల్ గా రాం చరణ్, ఎన్టీఆర్ ఫొటో

వైరల్ గా రాం చరణ్, ఎన్టీఆర్ ఫొటో

నటుడు రామ్‌చరణ్‌.. తారక్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఫొటో ఒకటి వైరల్ గా మారింది. చరణ్, ఎన్టీఆర్ ను వెనక నుంచి పట్టుకుని సరదాగా ఆటపట్టిస్తున్నట్లు ఉన్న ఫొటోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు సోదరా! ఈ ఏడాది నీకు అద్భుతంగా ఉండాలి' అని చరణ్‌ పోస్ట్ చేశారు.‌ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రాంచరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
న్యూయార్క్‌ పోలీస్‌గా తొలిసారి  సిక్కు మహిళ

న్యూయార్క్‌ పోలీస్‌గా తొలిసారి సిక్కు మహిళ

గురుశోచ్‌ కౌర్‌ అనే సిక్కు మహిళ తొలిసారిగా అరుదైన ఘనత సాధించారు. తలపాగా ధరించిన ఓ సిక్కు మహిళ మొదటిసారిగా న్యూయార్క్‌ పోలీస్‌ విభాగంలో చేరనున్నారు. న్యూయార్క్‌ సిటీ పోలీస్‌ అకాడమీలో గతవారం డిగ్రీ పూర్తి చేసుకున్న ఆమె పోలీసు సహాయక అధికారిణిగా న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరనున్నారు. యూఎస్‌ ప్రజలు సిక్కిజాన్ని అర్థం చేసుకునే విధంగా గురుశోచ్‌ కౌర్‌ మార్పుతేవాలని ‘మినిష్టర్‌ ఆఫ్‌ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌' హరదీప్‌ సింగ్‌ పూరి కోరారు.
పాకిస్తాన్ లో హిందూ  ఆలయానికి రూ 2 కోట్లు కేటాయింపు

పాకిస్తాన్ లో హిందూ ఆలయానికి రూ 2 కోట్లు కేటాయింపు

పాకిస్తాన్ లో హిందూ ఆలయానికి భారీగా నిధులు కేటాయించారు. రావల్పిండి సిటీలోని పురాతన కృష్ణుడి దేవాలయాన్ని వైభవంగా తీర్చిదిద్దేందుకు పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం రూ.2కోట్లు విడుదల చేసింది. పండుగల సమయంలో, ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భాల్లో హిందువులు అత్యధిక మంది దర్శనం కోసం వచ్చినప్పటికీ ఇబ్బందులు కలగకుండా ఆలయాన్ని పునరుద్ధరించనున్నారు. ఇస్లామాబాద్, రావల్పిండి జంట నగరాల్లో పూజలందుకుంటున్న ఏకైక హిందూ ఆలయం కృష్ణ దేవాలయం మాత్రమే కావడం విశేషం.