Short News

ఈ 'వధువు' ధర మిలియన్ డాలర్లే.!

ఈ 'వధువు' ధర మిలియన్ డాలర్లే.!

లండన్‌కు చెందిన డెబ్బీ వింగ్‌హామ్‌ అనే డిజైనర్‌ అందమైన వధువు బొమ్మను తయారు చేసారు. అయితే ఈ బొమ్మను కేక్‌తో తయారు చేసారు. ఈ అరబిక్‌ సంప్రదాయ పెళ్ళికూతురు కేకును తయారు చేయడానికి పది లక్షల డాలర్లు ఖర్చైంది. ఇందులో అయిదు విలువైన వజ్రాలను పొదిగారు. ఒక్కో వజ్రం ఖరీదు సుమారు రెండు లక్షల డాలర్లు. అందుకే దీన్ని ‘మిలియన్‌ డాలర్‌ బ్రైడ్‌' అంటున్నారు. దుబాయిలో జరిగిన ‘బ్రైడ్‌ షో'లో దీన్ని ప్రదర్శించారు.
11 పాయింట్లు వద్దు ..21 పాయింట్లే కావాలి

11 పాయింట్లు వద్దు ..21 పాయింట్లే కావాలి

ప్రపంచ బ్యాడ్మింటన్‌లోకి కొత్తగా రానున్న 11 పాయింట్ల విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానాన్ని కొందరు సానుకూలంగా ఉన్నా కొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం 21 పాయింట్ల చొప్పున గరిష్టంగా నిర్వహిస్తున్న మూడు గేమ్‌ల స్థానంలో 11 పాయింట్ల చొప్పున గరిష్టంగా 5 గేమ్‌లు ఆడించాలని భావిస్తున్నారు. మే 19న జరిగే బీడబ్ల్యూఎఫ్‌ వార్షిక సమావేశంలో ఈ ప్రతిపాదన చర్చకు రానుంది.
తెలుగోళ్ళు  అందాల 'బొమ్మ'గానే చూపించారు

తెలుగోళ్ళు అందాల 'బొమ్మ'గానే చూపించారు

'దేవదాసు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నడుము సుందరి 'ఇలియానా'. తెలుగు పరిశ్రమ తనను అందాల వస్తువుగానే చూసిందని ఆవేదనగా చెప్పింది. ఒక ఇంటర్వూలో మాట్లాడుతూ నాలుగైదు చిత్రాల తర్వాత కూడా తనను అందాల వస్తువుగానే చూపించడం ఇబ్బందికరంగానూ, బాధగానూ అనిపించినట్లు చెప్పింది. అసలు ఆట సినిమా చేయకూడదనుకున్నట్లుగా తెలిపిన ఈ గోవా భామ జల్సా, కిక్ చిత్రాలకు మంచి మార్కులేసింది.  
సంచలనం: హైదరాబాద్ సెలబ్రిటీని లేపేందుకు దావూద్ సుపారీ?, ఎవరత

సంచలనం: హైదరాబాద్ సెలబ్రిటీని లేపేందుకు దావూద్ సుపారీ?, ఎవరత

భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకరైన అండర్ వరల్డ్ డాన్ దావూద్‌ ఇబ్రహీం ఓ హైదరాబాద్ సెలబ్రిటీని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఆ సెలబ్రిటీని హత్య చేసేందుకు దావూద్ నమ్మిన బంటు చోటా షకీల్‌‌తో రూ.45 లక్షల ఒప్పందం కుదిరిందని పోలీసుల అదుపులో ఉన్న నసీం వెల్లడించాడు. అయితే ఆ సెలబ్రిటీ ఎవరన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. బహుశా సినీ రంగానికి చెందిన వ్యక్తే అయి ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఓ సెలబ్రిటీని చంపేంత అవసరం దావూద్ కు ఏమొచ్చిందనేది అంతుచిక్కని ప్రశ్న.