Short News

టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్‌ కారు లాంచ్‌.. 810 కి.మీ రేంజ్‌

టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్‌ కారు లాంచ్‌.. 810 కి.మీ రేంజ్‌

చైనీస్ టెక్ దిగ్గజం Xiaomi తన తొలి ఎలక్ట్రిక్ కారు SU7 లాంచ్‌తో అధికారికంగా ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మార్కెట్లోకి ప్రవేశించింది. గురువారం Xiaomi SU7ని సంస్థ విడుదల చేసింది. టెస్లా మరియు BYD వంటి టాప్‌ కంపెనీల మోడళ్లకు గట్టిపోటీగా Xiaomi ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని విడుదల చేసింది.
ప్రపంచంలోనే 'ది బెస్ట్‌ కారు' ఇదే.. ఈ కారు ప్రత్యేకతలు తెలుసా.??

ప్రపంచంలోనే 'ది బెస్ట్‌ కారు' ఇదే.. ఈ కారు ప్రత్యేకతలు తెలుసా.??

2024 వరల్డ్‌ కార్‌ అవార్డ్స్‌లో(World best car) కియా ఈవీ9 ఎస్‌యూవీ దుమ్ములేపింది. 2024 సంవత్సరానికి గానూ ఈ కారు ది బెస్ట్‌ ఈవీ కారు అవార్డుని దక్కించుకుంది. బీవైడీ సీల్‌ మరియు వోల్వో EX30 కార్లు తొలి మూడు స్థానాల్లో నిలిచి గట్టీ పోటినిచ్చాయి. అయితే చివరకు జెనీవా ఇంటర్‌నేషనల్‌ మోటర్‌ షోలో ఈవీ9 (Kia EV9) తొలి స్థానాన్ని సంపాదించింది.
దిశా పటానీ కార్ల ప్రపంచం.. ఇక్కడ చూడండి

దిశా పటానీ కార్ల ప్రపంచం.. ఇక్కడ చూడండి

ప్రముఖ బాలీవుడ్ నటి 'దిశా పటానీ' (Disha Patani) గురించి తెలియని వారు ఉండరంటే.. అతిశయోక్తి కాదు. కానీ ఈమె ఎలాంటి కార్లను ఉపయోగిస్తుందనే విషయం చాలామందికి తెలియాల్సిన విషయం. ఈ కథనంలో దిశా పటానీ ఉపయోగించే కార్లను గురించి తెలుసుకుందాం..ఎంఎస్ ధోని, ఏక్ విలన్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన దిశా పటానీ అత్యధిక పారితోషికం తీసుకునే సెలబ్రిటీలలో ఒకరు. ఈమె మొట్ట మొదట ఉపయోగించ కారు హోండా కంపెనీకి చెందిన సివిక్. ఇప్పుడు ఈమె గ్యారేజిలో ఖరీదైన అన్యదేశ్య కార్లు ఉన్నాయి. ఇందులో రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ మరియు చేవ్రొలెట్ క్రూజ్ వంటివి ఉన్నాయి.
6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు..

6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు..

భారత్‌లో హోండా బైక్‌లు, స్కూటర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్దాలుగా హోండా మోటార్‌సైకిల్‌ మరియు స్కూటర్‌ ఇండియా భారత మార్కెట్లో ఆధిపత్యం(Honda Sales In India) చెలాయిస్తోంది. ఈ క్రమంలో ఈ ప్రముఖ సంస్థ గణనీయమైన మైలురాయిని సాధించింది. 6 కోట్ల దేశీయ విక్రయాలతో కంపెనీ చారిత్రక మైలురాయిని సాధించి రికార్డు సృష్టించింది.