Short News

కోడిగుడ్లకు భయపడుతున్న అమెరికా ప్రజలు

కోడిగుడ్లకు భయపడుతున్న అమెరికా ప్రజలు

సల్మొనెల్లా. ఈ పేరు చెబితే అమెరికా ప్రజలు వణికిపోతున్నారు. సల్మొనెల్లా అనేది ఓ బ్యాక్టీరియా. కోడిగుడ్ల ద్వారా సల్మొనెల్లా వ్యాధి ప్రజలకు సోకుతుంది. కోడిగుడ్లలో నిల్వ ఉండే బ్యాక్టీరియా వల్ల జ్వరం, విరేచనాలు, వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పి కలుగుతుంది. ఈ స్థితి ఎక్కువ సేపు కొనసాగడం వల్ల మరణం కూడా సంభవించవచ్చు. ఇప్పటివరకూ 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ బ్యాక్టీరియా కారణంగా అమెరికాలోని సెమార్‌ రోజ్‌ ఎకర్స్‌ ఫార్మ్స్‌ దాదాపు 20 కోట్ల గుడ్లను వెనక్కు తీసుకుంది.2010 తర్వాత ఇంత భారీ మొత్తంలో కోడిగుడ్లను వెనక్కు తీసుకోవడం ఇదే తొలిసారి.
‘డాక్టర్‌ స్ట్రేంజ్‌’ ‌లో సచిన్  నటిస్తే బాగుంటుంది

‘డాక్టర్‌ స్ట్రేంజ్‌’ ‌లో సచిన్ నటిస్తే బాగుంటుంది

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెండూల్కర్‌ తన బయోపిక్‌ ‘సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌' చిత్రంతో నటుడిగా మారారు. అయితే ఈ సినిమాలో సచిన్‌ నటన ప్రముఖ హాలీవుడ్‌ నటుడు బెనెడిక్ట్‌ కంబర్‌ బ్యాచ్‌కి కూడా తెగ నచ్చేసినట్టుంది. సచిన్‌ అమెరికన్‌ సూపర్‌హీరో సిరీస్ ‘డాక్టర్‌ స్ట్రేంజ్‌' ‌లో నటిస్తే బాగుంటుందని బెనెడిక్ట్‌ అభిప్రాయపడుతున్నారు. ఈ సిరీస్‌లో బెనెడిక్ట్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బెనెడిక్ట్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్' చిత్రం భారత్‌లో ఏప్రిల్‌ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
షాకింగ్.. 40 కేజీల డ్రెస్ వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్!

షాకింగ్.. 40 కేజీల డ్రెస్ వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా మరో మారు వాయిదా పడి జూన్ 7 న విడుదలకు సిద్ధం అవుతోంది. రజనీకాంత్ నటించిన మరో చిత్రం 2.0 కూడా విడుదల కావలసి ఉంది. 2.0 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.శంకర్ ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారని, చిత్రం త్వరలోనే పూర్తవుతుందని అంటున్నారు. కాగా ఈ చిత్రంలో రజనీకాంత్ కీలకమైన స్టంట్స్ కోసం 40 కేజీల కాస్ట్యూమ్స్ ధరించారట.శంకర్ ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారని, చిత్రం త్వరలోనే పూర్తవుతుందని అంటున్నారు.

విమానంలో విరిగిన విండో ప్యానెల్, ముగ్గురికి తీవ్ర గాయాలు

విమానంలో విరిగిన విండో ప్యానెల్, ముగ్గురికి తీవ్ర గాయాలు

ఎయిరిండియా బోయింగ్ విమానం ప్రయాణికులను బెంబెల్లెత్తించింది. విమానంలోని విండో ప్యానెల్ విరిగి ప్రయాణికులపై పడడంతో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు.15 నిమిషాల పాటు ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అమృత్‌సర్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం ఢిల్లీలో ల్యాండైన వెంటనే గాయపడిన ముగ్గురు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. ఓవర్ హెడ్ ప్యానెల్‌కు తల బలంగా తాకిన ప్రయాణికుడికి కుట్లు పడినట్టు చెప్పారు.