Short News

కార్నివాల్ సంబరాల్లో 40 మంది మృత్యువాత

కార్నివాల్ సంబరాల్లో 40 మంది మృత్యువాత

బొలివియాలో కార్నివాల్ వీకెండ్ 40మంది మృత్యువాత ప‌డ్డారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఎక్కువ మంది రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 16 మంది రోడ్డు ప్రమాదాల్లో, 8 మంది ఫుడ్‌ స్టాల్‌ వద్ద గ్యాస్‌ ట్యాంక్‌ పేలడం వల్ల, మరో ఆరుగురు ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు. నలుగురు హత్యకు గురయ్యారని, ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మరో వ్యక్తి హైపోధెర్మియాతో చనిపోయారని ఆదేశ ప్రభుత్వం వెల్లడించింది. గత సంవత్సరం 2017 కార్నివాల్‌ సంబరాల్లో 67 మంది చనిపోయారని పోలీసులు చెప్పారు.
బన్నీకి అపుడు తెలివితేటల్లేవు, కళ్యాణ్ బాబుపై నీచరాజకీయాలు: నాగబాబు ఎమోషనల్ స్పీచ్

బన్నీకి అపుడు తెలివితేటల్లేవు, కళ్యాణ్ బాబుపై నీచరాజకీయాలు: నాగబాబు ఎమోషనల్ స్పీచ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా" ఆడియో ఫంక్షన్ మిలటరీ మాధవరంలో ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాగబాబు బన్నీ గురించి ఆసక్తికర కామెంట్ చేశారు. అల్లు అర్జున్ గురించి మాత్రమే కాకుండా తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి, అన్నయ్య చిరంజీవి గురించి కూడా ప్రస్తావించారు.

పవన్ కళ్యాణ్ రాక, ఒక్కొక్కడికి ఇక ఉంటదీ: నాగబాబు వార్నింగ్

పవన్ కళ్యాణ్ రాక, ఒక్కొక్కడికి ఇక ఉంటదీ: నాగబాబు వార్నింగ్

తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కొందరు ఉద్దేశ్యపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని, వారి దుమ్ము దులిపేందుకు కళ్యాణ్ వస్తున్నాడని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య -నా ఇల్లు ఇండియా సినిమా ఆడియో వేడుకలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాట్లాడొచ్చో లేదో తెలియదు కానీ అంటూ పవన్ అంశంపై స్పందించారు. పవన్, చెర్రీ, బన్నీ ఇలా మెగా కుటుంబానికి మొత్తానికి చిరంజీవి దారి చూపించారని అందుకు అన్నయ్యకు థ్యాంక్స్ అన్నారు.

ఏప్రిల్ 27న ‘కణం’ విడుదల

ఏప్రిల్ 27న ‘కణం’ విడుదల

నాగశౌర్య, సాయి పల్లవి కథానాయకులుగా తెరకెక్కిన చిత్రం 'కణం' ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణంలో ఎన్.వి.ఆర్ సినిమాస్ సమర్పణలో నిర్మితమైన 'కణం' ఏప్రిల్ 27న విడుద‌ల‌వుతుంది.‘‘సాయిప‌ల్ల‌వి, నాగ‌శౌర్య‌ల‌తో చేసిన కణం ఓ ఎమోష‌న‌ల్ మూవీ అని చెప్పారు ఎన్‌.వి.ప్ర‌సాద్. దర్శకుడు విజయ్ గారు ఎక్స్‌ట్రార్డిన‌రీగా తెర‌కెక్కించారు. శామ్ సి.ఎస్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌, నిర‌వ్ షా సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు అద‌న‌పు బ‌లం. ఆల్‌రెడీ విడుద‌లైన ట్రైల‌ర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వ‌చ్చింది.