Short News

డబ్బులకే కాదు.. ప్రేమకు కూడా  ఓ బ్యాంక్.

డబ్బులకే కాదు.. ప్రేమకు కూడా ఓ బ్యాంక్.

ఇప్పటి వరకు డబ్బులు దాచుకోవడానికి బ్యాంకులు ఉన్నాయని తెలుసు. కానీ ప్రేమకు ఓ బ్యాంకు ఉందని ఎప్పుడైన విన్నారా.? స్లోవేకియా యూరోపియన్ దేశంలో లవ్ బ్యాంక్ ఉంది. ఓ భార్య, భర్త కలిసి ప్రేమ బ్యాంక్ ను ఏర్పాటు చేశారు. ఇందులో మీ ప్రేమలను డిపాజిట్ కూడా చేయొచ్చు. సొరంగాన్ని పోలి ఉండే ఈ ఇంట్లో లక్ష వరకు డ్రాలు, లేఖలు పెట్టే స్థలం ఉంది.ఈ లవ్ బ్యాంకులో డబ్బులు ఉండవు. డబ్బుల కన్నా విలువైన జ్ఞాపకాలు, అక్షరాలు దాచుకోవచ్చు.
మహేష్ బాబు తో కలిసి సినిమా చూసిన కేటీఆర్

మహేష్ బాబు తో కలిసి సినిమా చూసిన కేటీఆర్

తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ భరత్ అనే నేను చిత్రాన్ని టీంతో కలిసి స్పెషల్ ప్రీమియర్ చూశారు. సినిమా బాగా నచ్చడంతో తన ట్విట్టర్ లో మహేష్ మరియు కొరటాల శివని అభినందించారు. సినిమా చాలా ఎంజాయ్ చేశానని స్నేహితుడు మహేష్, డైరెక్టర్ కొరటాల శివతో ఇంటరాక్షన్ జరిపినట్టు కేటీఆర్ తన ట్వీట్ ద్వారా తెలిపారు.ఓ మంచి కాజ్ కోసం కేటీఆర్ తొలి సారి ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు సమాచారం.విలువైన సమయాన్ని కేటాయించి, 'భరత్ అనే నేను' సినిమాను చూసినందుకు, తమ ప్రయత్నాలను ప్రశంసించినందుకు మీకు ధన్యవాదాలు అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.
సభ్యసమాజం ఆమోదించదు: బాలకృష్ణపై పురంధేశ్వరి ఫైర్

సభ్యసమాజం ఆమోదించదు: బాలకృష్ణపై పురంధేశ్వరి ఫైర్

ప్రధాని నరేంద్ర మోడీపై తెలుగుదేశం పార్టీ నేత, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. బాలకృష్ణ వ్యాఖ్యలు చాలా బాధాకరం అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం పురంధేశ్వరి కర్నాటకలో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. రాజ్యాంగబద్ధమైన దేశ ప్రధాని పదవిలో ఉన్న నరేంద్ర మోడీపై అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని సభ్య సమాజం ఆమోదించదని చెప్పారు. అనంతరం కర్నాటక ఎన్నికలపై మాట్లాడారు.

విశాఖ జిల్లాలో ప‌డ‌గ విప్పుతున్న ఆంత్రాక్స్‌!

విశాఖ జిల్లాలో ప‌డ‌గ విప్పుతున్న ఆంత్రాక్స్‌!

విశాఖ మన్యంలో మరో నలుగురికి ఆంత్రాక్స్‌ లక్షణాలు బయటపడ్డాయి. చింతపల్లి మండలం కొమ్మంగి పంచాయతీ గెంజిగెడ్డలో నలుగురికి చేతులకు పుళ్లు పడటంతో వైద్య సిబ్బంది హుటాహుటిన చింతపల్లి ఆసుపత్రికి తరలించారు. ఓ పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంత్రాక్స్‌పై సమీక్ష నిర్వహిస్తుండగానే ఈ విషయం బయటపడటంతో అధికారుల్లో హడావుడి మొదలైంది. గిరిజన ప్రాంతంలో ఆంత్రాక్స్‌ వ్యాప్తిపై వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. నిన్న గూడెం కొత్తవీధి దామనాలపల్లి మాడెంలో ఏడుగురు ఆంత్రాక్స్‌ బాధితులను వైజాగ్‌ కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు.