Short News

200కు చేరిన 'జపాన్‌' వరదల మృతులు

200కు చేరిన 'జపాన్‌' వరదల మృతులు

జపాన్‌ దేశం భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమయింది.  గతవారం కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలలో చిక్కుకుని, కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య 200కి చేరింది. దశాబ్ద కాలంలో వచ్చిన విపత్తుల్లో భయంకరమైనది ఇదేనని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వరదలు తగ్గుముఖం పట్టడంతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారికోసం గాలిస్తున్నారు. కుండపోత వర్షాలతో ఇళ్ళు, భవనాలు, రహదారులు ధ్వంసమయ్యాయి. దాదాపు ఏడు వేల మంది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. రైలు, రవాణా మార్గాలు దెబ్బతిని రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
RX 100 కలెక్షన్ల జోరు..  నాలుగు రోజుల్లో 10 కోట్లు!

RX 100 కలెక్షన్ల జోరు.. నాలుగు రోజుల్లో 10 కోట్లు!

టాలీవుడ్‌లో సెన్సేషనల్ హిట్టుగా క్రేజ్ సంపాదించుకొన్న RX 100 చిత్రం వసూళ్ల సునామీని సృష్టిస్తున్నది. ఈ చిత్రానికి ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ, వస్తున్న కలెక్షన్లను చూసి ట్రేడ్ వర్గాలు కంగుతింటున్నాయి. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే 10 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించడం సినిమా స్టామినాకు అద్దంపడుతున్నది. వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో నూతన నటీనటులు కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్ నటించిన ఈ చిత్రం గురువారం రిలీజైన సంగతి తెలిసిందే.

పేలిన సెల్‌ఫోన్‌:తృటిలో తప్పిన ముప్పు

పేలిన సెల్‌ఫోన్‌:తృటిలో తప్పిన ముప్పు

తిరుపతి:సెల్ ఫోన్ లు పేలిపోతున్న ఘటనలకు సంబంధించిన వార్తలు వినియోగదారులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా కాణిపాకంలో సోమవారం ఓ బాలుడి చేతిలో సెల్‌ఫోన్‌ పేలింది. ఫోన్ ఛార్జింగ్‌లో ఉండగా ఫోన్‌ వెనుక భాగం నుంచి పొగలు వస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించిన బాలుడు ఫోన్‌ను తీసుకొని దూరంగా విసిరేయడంతో పెద్ద శబ్దంతో ఫోన్ పేలిపోయింది. దీంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో బాలుడి కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొంచెం ఉంటే ఫోన్ బాలుడి చేతి లోనే పేలి ఉండేదని ఆందోళన వెలిబుచ్చారు.

స్కూల్ లో పిల్లల పెర్ఫార్మెన్స్ పూర్ గా ఉన్నప్పుడు పాటించవలసిన ఆస్ట్రాలజికల్ రెమెడీస్

స్కూల్ లో పిల్లల పెర్ఫార్మెన్స్ పూర్ గా ఉన్నప్పుడు పాటించవలసిన ఆస్ట్రాలజికల్ రెమెడీస్

ఈ పోటీ ప్రపంచంలో, తల్లితండ్రులు తమ బిడ్డల ఎడ్యుకేషన్ విషయంలో ఎంతో శ్రద్ధను కనబరుస్తున్నారు. సరిగ్గా మార్క్స్ తెచ్చుకోని పిల్లలు తల్లిదండ్రులకు తలనొప్పిని తీసుకువస్తున్నారు. నిజానికి, తల్లిదండ్రులు పిల్లల పెర్ఫార్మెన్స్ పట్ల అమితమైన ఒత్తిడికి గురవుతున్నారు. నిజానికి, ఎన్నో సందర్భాలలో, పిల్లలు ఏకాగ్రతను చూపించలేకపోయారు. ఎక్కువగా ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్ ని వాడటం అన్నిటికంటే ముఖ్యమైన ఒక విషయం. ఇది అటెన్షన్ ను డిస్టర్బ్ చేస్తుంది.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more