Short News

'కవర్'లో పౌడర్ ..ఆస్పత్రిలో ట్రంప్ కోడలు

'కవర్'లో పౌడర్ ..ఆస్పత్రిలో ట్రంప్ కోడలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పెద్ద కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ భార్య వానెస్సా ట్రంప్‌ను ఆస్పత్రిలో చేర్చారు. వారి ఇంటికి వచ్చిన ఓ కవర్‌ నుంచి ఏదో తెల్లని పౌడర్‌ ఆమెపై పడింది. తలతిరగడం, వికారంగా అనిపిండచంతో వెనెస్సాతో పాటు ఆమె తల్లి, మరో వ్యక్తిని కూడా ఆస్పత్రికి తరలించారు. ఆ పౌడర్‌ ప్రమాదకరమైంది కాదని స్పష్టమైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. 
మిలిటెంట్ల స్థావరాలపై దాడులు.. 90కి పైగా మంది మృతి

మిలిటెంట్ల స్థావరాలపై దాడులు.. 90కి పైగా మంది మృతి

సిరియాలో డమస్కస్‌కు సమీపంలో ఉన్న ఈస్ట్రన్ గౌటా ప్రాంతంలో జరిగిన వైమానిక దాడుల్లో 94 మంది మృతిచెందగా మరో 20 మంది గాయపడ్డారు. కొంతకాలంగా సిరియా ఆర్మీ ఉగ్ర స్థావరాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో మిలిటెంట్లపై దాడులు జరుగుతున్నట్లు డమస్కస్ ప్రభుత్వం వెల్లడించింది. సుమారు 4 లక్షల మంది జీవిస్తున్న ఈస్ట్రన్ గౌటా 2013 నుంచి మిలిటెంట్ల ఆధీనంలో ఉంది. 
బీఎస్‌ఎన్‌ఎల్‌ నుండి పలు కొత్త ఆఫర్స్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుండి పలు కొత్త ఆఫర్స్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్తగా ఆఫర్లు ప్రకటించింది. ఎస్‌టీవీ-99, ఎస్‌టీవీ-319, ప్లాన్‌-999, ప్లాన్‌-949, డేటా ఎస్‌టీవీ-7 పేరుతో ఈ ప్లాన్లు తీసుకొచ్చింది. ఉన్నాయి. ఎస్‌టీవీ-319, 99 ప్లాన్లు మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే ప్లాన్‌ 999, 949, డేటా ఎస్‌టీవీ-7 ప్లాన్‌  అందుబాటులో ఉన్నాయి. సోమవారం నుంచి ఈనెల 28 వరకు మెగా సిమ్‌ మేళా నిర్వహిస్తోంది. ఉచితంగా 3జీ సిమ్‌తో పాటు ప్రతి రూ.110 రీచార్జ్‌తో ఫుల్‌ టాక్‌టైమ్‌ లభిస్తాయి.
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా, కటిక పేదరికం, మెడపట్టి గెంటేశారు: జబర్దస్త్ గెటప్ శ్రీను

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా, కటిక పేదరికం, మెడపట్టి గెంటేశారు: జబర్దస్త్ గెటప్ శ్రీను

జబర్దస్త్ కార్యక్రమంలో వివిధ గెటప్స్ వేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు గెటప్ శ్రీను. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన జీవితం గురించి, కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. చిన్న తనంలో తాను పడ్డ కష్టాలతో పోలిస్తే ఇండస్ట్రీలో పడ్డ కష్టం పెద్ద కష్టమే కాదన్నారు. కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న అవమానాల గురించి కూడా తెలిపారు. నేను బాగా హర్టయిపోయి సూసైడ్ వరకు వెళ్లింది తేజ కేక సినిమా సమయంలో అని తెలిపారు. చివరకు బ్రతికి సాధిద్దామని డిసైడైనట్లు తెలిపారు.