Short News

ఆ దీవి  మహిళలకు మాత్రమే.!

ఆ దీవి మహిళలకు మాత్రమే.!

ఫిన్లాండ్‌ తీరానికి ఆవతల ఉన్న ఓ దీవిలోకి అడుగుపెట్టడానికి పురుషులకు అనుమతి లేదు. క్రిస్టినా రోత్‌ అనే అమెరికన్‌ మహిళా వ్యాపారవేత్త వెకేషన్‌ కాలాన్ని ప్రశాంతంగా గడపడానికి రాంచ్‌ మాలిబు సమీపంలోని ఒక ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ పురుషుల ఉనికితో మహిళల ప్రశాంతతకు భంగం కలుగుతుందని గమనించారు. మహిళల కోసం ఫిన్లాండ్‌ తీరానికి ఆవల 8.5ఎకరాల దీవిని కొని, మహిళల విడిది కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఇక్కడికి దేశ దేశాల నుంచి మహిళలు వస్తున్నారు.
మేఘ అస్సలు ఊరుకోవడం లేదుగా..నితిన్ ని ఎలా బెదరగొడుతోందో విన్నారా..లిరికల్ సాంగ్!

మేఘ అస్సలు ఊరుకోవడం లేదుగా..నితిన్ ని ఎలా బెదరగొడుతోందో విన్నారా..లిరికల్ సాంగ్!

నితిన్ నటిస్తున్న మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ కావడంతో చల్ మోహన్ రంగ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజగా చిత్ర యూనిట్ ఆహ్లాదకరమైన మెలోడీ సాంగ్ ని విడుదల చేసింది. నితిన్, హీరోయిన్ మేఘ ఆకాష్ మధ్య సంభాషణతో ఈ సాంగ్ ప్రారంభం అవుతుంది. ఈ సాంగ్ చాలా అందంగా ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. సంగీతం వినసొంపుగా ఉంటూ పాట వెంటనే నచ్చేసేలా ఉంది. తమన్ జోరు చూస్తుంటే మరో సూపర్ హిట్ ఆల్బమ్ ఛల్ మోహన్ రంగ చిత్ర రూపంలో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

టీ20లు లేకుంటే క్రికెట్‌ మనుగడ కష్టమే

టీ20లు లేకుంటే క్రికెట్‌ మనుగడ కష్టమే

టీ20 లేకుంటే క్రికెట్‌ మనుగడ కష్టమేనని భారత మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం భారత జట్టు శ్రీలంకలో ముక్కోణపు టీ20 టోర్నీ ఆడనుండటంపై స్పందించాడు. మరోవైపు మూడో మ్యాచ్‌లో గెలిచి టీమిండియా టీ20 సిరీస్‌ సొంతం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేసాడు. మనీష్‌ పాండే, హర్ధిక్‌ పాండ్యలు భారత జట్టులో సెహ్వాగ్‌, హర్భజన్‌లా జట్టులో కీలక ఆటగాళ్ళుగా మారడానికి సమయం పడుతుందన్నాడు.
అబ్బాయ్ డైరెక్టర్ తో బాలయ్య..వివి వినాయక్ నో.. దుమ్ము దుమారమే!

అబ్బాయ్ డైరెక్టర్ తో బాలయ్య..వివి వినాయక్ నో.. దుమ్ము దుమారమే!

జై సింహా చిత్రం విజయం సాధించడంతో బాలయ్య మంచి జోరు మీద ఉన్నాడు. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించాల్సి ఉంది. తేజ ఈ చిత్రానికి దర్శకుడు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ గ్యాప్ లో బాలయ్యతో ఓ సినిమా చేయాలని జై సింహా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడిని బాలయ్యతో సినిమా కోసం ఒప్పించే ప్రయత్నం జరుగుతోంది. ప్లాపుల్లో ఉన్న కళ్యాణ్ రామ్ కు పటాస్ చిత్రంతో అనిల్ సూపర్ హిట్ ఇచ్చాడు.